Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blue Flag: దేశంలో మరో రెండు బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్.. మొత్తం పదికి చేరిన అంతర్జాతీయ స్థాయి సాగరతీరాలు!

దేశంలోని రెండు బీచ్‌లు 'బ్లూ ఫ్లాగ్' సర్టిఫికేట్ పొందాయి. వీటిలో కేరళలోని కోవలం.. పుదుచ్చేరిలోని ఈడెన్ బీచ్ ఉన్నాయి.

Blue Flag: దేశంలో మరో రెండు బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్.. మొత్తం పదికి చేరిన అంతర్జాతీయ స్థాయి సాగరతీరాలు!
Blue Flag Beach
Follow us
KVD Varma

|

Updated on: Sep 23, 2021 | 5:50 PM

Blue Flag: దేశంలోని రెండు బీచ్‌లు ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేట్ పొందాయి. వీటిలో కేరళలోని కోవలం.. పుదుచ్చేరిలోని ఈడెన్ బీచ్ ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇప్పటివరకు, బ్లూ ఫ్లాగ్ ను పొందిన భారతదేశంలోని బీచ్‌ల సంఖ్య 10 కి పెరిగింది. దేశంలోని ఎనిమిది బీచ్‌లు గత ఏడాది ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికెట్ పొందాయి.

బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అంటే ఏమిటి? ఇప్పటి వరకు దేశంలోని ఏ బీచ్‌లు ఈ సర్టిఫికెట్‌ను పొందాయి? దేశానికి ఈ విజయం యొక్క అర్థం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం..

‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికెట్ అంటే..

ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (FEE) అనేది ఒక డానిష్ సంస్థ. ఇది బీచ్‌లకు ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికెట్‌లు ఇవ్వడం కోసం పనిచేస్తుంది. ఇది ఒక రకమైన ఎకో-లేబుల్. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ సర్టిఫికేట్ పొందిన బీచ్‌లు అనేక స్థాయిలలో పరీక్షలు జరపిన తరువాత సర్టిఫికేట్ ఇస్తారు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ జరీ ఇలా..

బీచ్‌కు ఈ సర్టిఫికెట్‌ను ప్రదానం చేయడానికి ముందు, సంస్థ దానిని 33 కఠినమైన ప్రమాణాల ఆధారంగా పరిశీలిస్తుంది. పర్యావరణం, స్నానపు నీటి నాణ్యత, పర్యావరణ నిర్వహణ, బీచ్ భద్రత, సేవలు వంటి 33 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే బీచ్‌లు ఈ సర్టిఫికెట్‌ను పొందుతాయి.

ఈ సర్టిఫికెట్ ప్రయోజనం ఇదే..

దీని అతిపెద్ద ప్రయోజనం పర్యావరణ పర్యాటకానికి సంబంధించినది. దేశంలోని బీచ్‌లు సందర్శించడానికి లేదా సమయం గడపడానికి ఉత్తమమైన బీచ్ లను బ్లూ ఫ్లాగ్ ద్వారా పర్యాటకులు తెలుసుకోవచ్చు. వారు స్నానం చేయడానికి స్వచ్ఛమైన నీరు, సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఈ బీచ్ లలో పొందవచ్చు. పర్యాటకుల పరంగా దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా ఇది పాత్ర పోషిస్తుంది.

ఇది ఎలా సాధ్యమైంది?

బీచ్‌లను శుభ్రం చేయడానికి 2018 జూన్ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ మంత్రిత్వ శాఖ ‘ఐ యామ్ సేవింగ్ మై బీచ్’ ప్రచారం ప్రారంభించింది. ఈ ప్రచారం దేశంలోని 13 తీర రాష్ట్రాలలో ప్రారంభించారు. ఈ ప్రచారం ద్వారా బీచ్‌లను శుభ్రం చేసిన తర్వాత, పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంది. దేశం ఈ విజయాన్ని సాధించింది.

ఈ 8 బీచ్‌లు 2020 లో ‘బ్లూ ఫ్లాగ్’ పొందాయి

  • శివరాజ్‌పూర్-గుజరాత్
  • ఘోఘల-డయ్యూ,
  • కాసర్‌కోడ్, పదుబిద్రి-కర్ణాటక
  • కప్పడ్-కేరళ
  • రుషికొండ- ఆంధ్ర
  • గోల్డెన్-ఒడిశా
  • రాధానగర్ – అండమాన్- నికోబార్

కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ బ్లూ ఫ్లాగ్ బీచ్ ల పై చేసిన ట్వీట్ ఇదే..

ఇవి కూడా చదవండి: 

Soldier Body Found: మిస్సైన 13 నెలల తర్వాత పాడైపోయిన స్థితిలో దొరికిన జవాన్‌ డెడ్‌బాడీ.. అసలేం జరిగిందంటే