AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: రెండున్నర అడుగుల వరుడు.. మూడు అడుగుల వధువు.. చివరకు ఎట్టకేలకు..

ప్రపంచంలోనే అత్యంత పొట్టివ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఏం లాభం.. పెళ్లి చేసుకోవాలనుకున్న తన కల కలగానే మిగిలిపోతుందేమోనని భయపడ్డాడు. చివరకు ఎట్టకేలకు తన కల నెరవేర్చుకున్నాడు. తనకంటే..

Uttar Pradesh: రెండున్నర అడుగుల వరుడు.. మూడు అడుగుల వధువు.. చివరకు ఎట్టకేలకు..
Marriage In Uttar Pradesh
Ganesh Mudavath
|

Updated on: Nov 05, 2022 | 10:56 AM

Share

ప్రపంచంలోనే అత్యంత పొట్టివ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఏం లాభం.. పెళ్లి చేసుకోవాలనుకున్న తన కల కలగానే మిగిలిపోతుందేమోనని భయపడ్డాడు. చివరకు ఎట్టకేలకు తన కల నెరవేర్చుకున్నాడు. తనకంటే అర అడుగు ఎత్తైన యువతిని వివాహం చేసుకుని కలను సాకారం చేసుకున్నాడు. ఉత్తర ప్రదేశ్‌ షామ్లీలోని కైరానాకు చెందిన 32 ఏళ్ల అజీమ్‌ మన్సూరి ఎత్తు కేవలం రెండున్నర అడుగులు. ఎత్తు తక్కువగా ఉండటంతో అతనికి వివాహం జరగడం కష్టంగా మారింది. పెళ్లి చేసుకుని తానూ ఓ ఇంటివాడిని అవ్వాలనే కలలు కనే అజీమ్‌ తనకు జోడైన అమ్మాయిని చూసి పెట్టమని ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులను సైతం కలిసి విన్నవించుకున్నాడు. తనకు ఈడు, జోడైన వధువు కోసం ఏళ్లతరబడి ప్రయత్నించాడు. ఎట్టకేలకు తన ప్రయత్నం ఫలించింది. గతేడాది మార్చిలో తనకు జోడైన మూడు అడుగుల ఎత్తైన బుష్రాను కలిశాడు. హాపూర్‌కు చెందిన ఆమెతో గత ఏడాది ఏప్రిల్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. అయితే బుష్రా డిగ్రీ చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. అంతేకాదు తమ వివాహానికి వచ్చి, తమను ఆశీర్వదించాల్సిందిగా ప్రధాని మోడీకి సైతం ఇన్విటేషన్‌ పంపిస్తానని అజీమ్‌ చెప్పాడు.

ఈ పరిస్థితుల నడుమ బుష్రా ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. దాంతో అజీమ్‌ మన్సూరి కలగన్న రోజు రానే వచ్చింది. మన్సూరి ఇంట పెళ్లి ఏర్పాట్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. తనను అభిమానించే వారినందరినీ పెళ్లికి ఆహ్వానించాడు. దీంతో అందంగా ముస్తాబైన మన్సూరి ఇంటి వద్దకు వారంతా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. బుష్రాతో అతడి పెళ్లి నవంబరు 2 న వైభవంగా జరిగింది. ‘దేవుని దయతో, ఈ క్షణం నా జీవితంలోకి వచ్చింది. ఇది సంతోషకరమైన సందర్భం. నా ప్రాంతంలోని ప్రతి ఒక్కరినీ నా పెళ్లికి ఆహ్వానించాను’ అని మన్సూరి తెలిపాడు. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాడు. అత్యంత పొట్టి వాడైన వరుడితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. దీంతో జనం తాకిడితో ఇబ్బంది పడిన పొరుగువారు, స్థానికులను నియంత్రించేందుకు పోలీసుల సహాయం కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.