దారుణం, 12 ఏళ్ళ చిన్నారులకు పోలియో చుక్కల బదులు హ్యాండ్ శానిటైజర్ వేసిన వైనం

మహారాష్ట్రలోని యావత్ మల్ జిల్లాలో దారుణం జరిగింది. గత నెల 31 న ఆదివారం పోలియో దినోత్సవం సందర్భంగా దేశంలో 5 ఏళ్ళ లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేశారు.

దారుణం, 12 ఏళ్ళ చిన్నారులకు పోలియో చుక్కల బదులు హ్యాండ్ శానిటైజర్ వేసిన వైనం
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Feb 02, 2021 | 11:43 AM

మహారాష్ట్రలోని యావత్ మల్ జిల్లాలో దారుణం జరిగింది. గత నెల 31 న ఆదివారం పోలియో దినోత్సవం సందర్భంగా దేశంలో 5 ఏళ్ళ లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేశారు. అయితే ఈ జిల్లాలో 12 మంది పిల్లలకు ఈ చుక్కల బదులు హ్యాండ్ శానిటైజర్ చుక్కలు వేశారు వైద్య సిబ్బంది.. అదృష్ట వశాత్తూ ఈ సంగతి వెంటనే తెలియడంతో వారినందరినీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స తక్షణమే లభించడంతో వారికి ఏ అస్వస్థత లేదని, క్షేమంగా ఉన్నారని జిల్లా అధికారులు తెలిపారు. కాగా అభంశుభం తెలియని చిన్నారులకు శానిటైజర్ వేసిన ఓ డాక్టర్, ఓ హెల్త్ వర్కర్, ఆశా వర్కర్లను సస్పెండ్ చేస్తామని వారు చెప్పారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. వీరు పొరబాటున ఇలా చేశారా లేక నిర్లక్ష్యమో తేలాల్సి ఉందన్నారు.

Read More:బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోస్టర్ పై ఉమ్మివేసిన దుండగులు, శుభ్రం చేసిన బీజేపీ నేత

Read More:సీబీఎస్ఈ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఈరోజు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయనున్న బోర్డు..