Rahul Gandhi: కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ తెచ్చేలా రాహుల్ జోడో యాత్ర.. అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ హామి
ఆరేడు గంటలు నడుస్తున్నా. మీరందరు చెప్పింది వింటున్నా. మీ బాధలేంటో నాకంతా అర్ధమవుతోంది. తెలంగాణలో రాజు స్థానంలో నియంత పాలిస్తున్నారు. ఇదీ తెలంగాణలో సాగుతోన్న జోడో యాత్రలో రాహుల్ కామెంట్ల సారాంశం. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ రెండే. ఒకరినొకరు సహకరించుకుంటున్నారనీ కామెంట్ చేశారు రాహుల్. తామొస్తే.. ఉద్యోగాలు భూములను ఇస్తామనీ హామీ ఇచ్చారాయన.

యువతకు ఎన్నో కలలు.. కానీ నెరవేర్చేందుకు సహకరించని ప్రభుత్వాలు.. బీజేపీ హింస ప్రేరేరిపస్తుంటే.. ఇందుకు టీఆర్ఎస్ కోపరేట్ చేస్తోందని అన్నారు ఎంపీ రాహుల్. దేశంలో బీజేపీ, RSS కలసి మత విద్వేషాల చిచ్చు రాజేస్తోందని కామెంట్ చేశారు రాహుల్. లోక్ సభ, రాజ్య సభల్లో టీఆర్ఎస్ ఇందుకు మద్ధతు తెలుపుతోందని అన్నారాయన. తెలంగాణలోని అన్ని వర్గాలతో తాను మాట్లాడాననీ.. వారి సమస్యలను తెలుసుకుంటున్నాననీ అన్నారు రాహుల్. రాష్ట్ర యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోందనీ.. రాష్ట్రంలో సీఎం స్థానంలో ఒక రాజు నియంతలా పరిపాలిస్తున్నారనీ.. అన్నారు రాహుల్. ప్రజలను దోచుకోవడమే కేసీఆర్ టార్గెట్. లక్షలాది గిరిజనులకు కాంగ్రెస్ భూమి హక్కునిచ్చింది. అదే కేసీఆర్ ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారనీ చెప్పుకొచ్చారు రాహుల్. తమ ప్రభుత్వం వస్తే.. గిరిజనుల భూములు తిరిగి వారికే ఇస్తామని అన్నారాయన.
దళితులకు 25 లక్షల ఎకరాలను కాంగ్రెస్ ఇచ్చిందనీ.. మన ప్రభుత్వం రాగానే అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తామనీ అన్నారు రాహుల్. భూమితో పాటు పూర్తి హక్కు వారికే ఇచ్చేలా చట్టం చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ. నిరుద్యోగానికి ప్రధాన కారణం నోట్ల రద్దు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల చిన్నవ్యాపారులకు పెద్ద దెబ్బ తగులుతోంది. మా ప్రభుత్వం వస్తే.. జీఎస్టీలో మార్పులు తెస్తాం. దేశ వ్యాప్తంగా ఒకటే జీఎస్టీ ఉంటుందని అన్నారు రాహుల్ గాంధీ.
అధికారంలోకి రాగానే తిరిగి రైతు రుణమాఫీ చేస్తామనీ.. ఈ యాత్రలో హింస, ద్వేషాలకు తావు లేదనీ.. మీ అందరి ఆదరాభిమానాల వల్ల ఎంత దూరం నడిచినా అలసట కలగడం లేదనీ చెప్పారు రాహుల్ గాంధీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం