షాకింగ్‌ న్యూస్‌.. వ్యక్తి గొంతులో కొబ్బరికాయంత కణితిని తొలగించిన వైద్యులు..

దాంతో అతన్ని పరిశీలించిన వైద్యులు షాక్‌ అయ్యారు. అతడి గొంతులో పెరిగిపోయిన థైరాయిడ్‌ గ్రంథిని గుర్తించి సర్జరీ చేయాలని సూచించారు.

షాకింగ్‌ న్యూస్‌..  వ్యక్తి గొంతులో కొబ్బరికాయంత కణితిని తొలగించిన వైద్యులు..
Surgery
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 28, 2022 | 8:05 PM

ఇది నిజంగా షాకింగ్‌ న్యూసే.. ఒక వ్యక్తి గత ఆరు నెలలుగా శ్వాస తీసుకోవడం, మింగడం సమస్యతో బాధపడుతున్నాడు. ఇప్పుడు వైద్యులను సంప్రదించగా థైరాయిడ్‌ గ్రంథిలో కొబ్బరికాయ పరిమాణంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. ఆపై ఢిల్లీ వైద్యులు శస్త్రచికిత్స చేసి ఇప్పుడు దాన్ని తొలగించారు. అయితే వ్యక్తి స్వరాన్ని కాపాడటం మాత్రం సవాలేనని వైద్యులు తెలిపారు.

శస్త్రచికిత్స చేయించుకున్న 72 ఏళ్ల వ్యక్తి బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాకు చెందినవాడు. పేరు గంగారామ్‌.. గత ఆరు నెలల నుండి మింగడానికి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఆసుపత్రిలో వైద్యుడిని సంప్రదించాడు. దాంతో అతన్ని పరిశీలించిన వైద్యులు షాక్‌ అయ్యారు. అతడి గొంతులో పెరిగిపోయిన థైరాయిడ్‌ గ్రంథిని గుర్తించి సర్జరీ చేయాలని సూచించారు. ఈ మేరకు డా. సంగీత్ అగర్వాల్, ‘ఇన్ని సంవత్సరాల నా కెరీర్‌లో 250 మందికి పైగా థైరాయిడ్ ట్యూమర్ సర్జరీ చేశానని వివరించారు. ఈ వ్యక్తిలో పెరిగిన కణితి భారీగా ఉందన్నారు..

సాధారణంగా థైరాయిడ్ గ్రంధి సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. బరువు 10-15 గ్రాముల వరకు ఉంటుంది. పరిమాణం కూడా 3-4 సెం.మీటర్ల వరకు ఉంటుంది. కానీ, ఈ వ్యక్తిలో 18-20 సెం.మీ పరిమాణంలో కొబ్బరికాయ సైజులో పెరిగిందని చెప్పారు. రోగి స్వరపేటిక దెబ్బతినకుండా శస్త్రచికిత్స చేయడం సవాలుగా మారిందన్నారు. గ్రంధులు ఈ మేరకు పెరిగినప్పుడు, పారాథైరాయిడ్ గ్రంథులను రక్షించడం కష్టం. కానీ తము అన్నింటినీ సాఫీగా నిర్వహించామని చెప్పారు. మొత్తం మూడు గంటల పాటు సర్జరీ జరిగిందని డాక్టర్ సంగీత్ అగర్వాల్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల