AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కసారిగా సమోసాను తినేస్తే రూ. 51,000 మీ సొంతం.. కానీ చిన్న ట్విస్ట్ ఉందండి.. మీరు ట్రై చేస్తారా ?

ఈ సమోసాకు సంబంధించిన వీడియో చూసిన వారి సంఖ్య సోషల్ మీడియాలో 5 లక్షలు దాటింది. సమోసాను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్, రీట్విట్స్ తో హోరెత్తిస్తున్నారు.

ఒక్కసారిగా సమోసాను  తినేస్తే రూ. 51,000  మీ సొంతం.. కానీ చిన్న ట్విస్ట్ ఉందండి..  మీరు ట్రై చేస్తారా ?
Gigantic Samosa
Jyothi Gadda
|

Updated on: Oct 28, 2022 | 7:30 PM

Share

సమోసా! ఈ పేరు చెబితే చాలు… చాలా మందికి నోట్లో నీళ్లు ఊరడం ఖాయం..ఇక కళ్ల ముందు కనిపిస్తే.. ఒక్క క్షణం కూడా లేట్‌ చేయకుండా తినేస్తారు.. వేడి సమోసా తింటుంటే..ఆ టేస్టే వేరు గురూ..! ఒక్కసారిగా మినీ సమోసా అయితే గుట్టుక్కున నమిలి మింగేస్తాం..అలాంటివి మామూలు సమోసా అయితే ఏడెనిమిది దాకా లాగించేస్తారు… అయితే, ఇదిగో ఈ బడా సమోసాని చూడండి..ఎంత పెద్దదిగా ఉందో.. మీరు ఏ చివర, ఎక్కడ నుండి తింటారు? ఇంతపెద్ద సమోసాని ఒక్కరే తినడం కూడా అసాధ్యం. అయితే దీన్ని తయారు చేసిన మీరట్ స్వీట్ షాప్ మాత్రం ఒక్కరే ఈ బిగ్‌సమోసాని తినాలని షరతు విధించింది. దానికి సంబంధించిన వార్తను వ్యాపారవేత్త హర్ష గోయెంకా ట్వీట్ చేయడంతో ఇప్పుడీ సమోసా కాంపీటెషన్‌ వైరల్ అవుతోంది.

8 కేజీల బరువున్న ఈ సమోసాను ఒక్కరే తినలేం కదా? ఈ సమోసా మీరట్‌లోని కౌశల్ స్వీట్స్ అనే దుకాణంలో తయారు చేయబడింది. దీన్ని మొదట ఫుడ్ బ్లాగర్ చాహత్ ఆనంద్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అంతేకాదు ఈ సమోసాకు సంబంధించిన వీడియో చూసిన వారి సంఖ్య సోషల్ మీడియాలో 5 లక్షలు దాటింది.

ఇవి కూడా చదవండి

సమోసాలు తింటే ఆరోగ్యం కచ్చితంగా మెరుగవుతుందంటున్నారు కొందరు నెటిజన్లు. మీ జీవితంలో ఒక్కసారైన సమోసాలు తిన్నారా..? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే కౌశల్ స్వీట్స్ షో కోసం ఈ సమోసాను తయారు చేయలేదు. ఈ సమోసాను 30 నిమిషాల వ్యవధిలో ఒకరే తింటే రూ. 51,000 నగదు బహుమతిని ప్రకటించారు. అయితే, ఇలాంటి సమోసా తిన్న తర్వాత ఏదైనా అనారోగ్య సమస్య ఎదురైతే సదరు పోటీ దారుడి ఆస్పత్రి ఖర్చులు ఎవరు భరిస్తారంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ధరలు పెరగనున్నాయా..?
తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ధరలు పెరగనున్నాయా..?
ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్.
ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్.
తాబేలు ఉంగరం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. కానీ ఈ రాశులకు కాదు
తాబేలు ఉంగరం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. కానీ ఈ రాశులకు కాదు
'ధురంధర్ 2'లో మరో స్టార్ హీరో.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా
'ధురంధర్ 2'లో మరో స్టార్ హీరో.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా
సముద్రపు లోతుల్లోకి "ISRO' ప్రయాణం
సముద్రపు లోతుల్లోకి
అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్న
అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్న
పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రెస్ ఎలా మార్చుకోవాలో తెలుసా?
ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రెస్ ఎలా మార్చుకోవాలో తెలుసా?
పండ్లు Vs జ్యూస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీరు ఊహించినది..
పండ్లు Vs జ్యూస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీరు ఊహించినది..
ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ వివరాలు ఇవిగో
ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ వివరాలు ఇవిగో