AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitish Kumar: బీహార్ పొలిటికల్ కారిడార్‌లో మరో ట్విస్ట్.. నితీష్ సర్కార్‌లో మొదలైన ముసలం..

బీహార్ పొలిటికల్ కారిడార్‌లో ముసలం పుట్టింది. మహాకూటమిలో చీలిక సంకేతాలు అప్పుడు పొడసూపాయి. ఉపేంద్ర కుష్వాహా ప్రకటన ఇప్పడు నితిన్ పార్టీలో సంచలనంగా మారింది.

Nitish Kumar: బీహార్ పొలిటికల్ కారిడార్‌లో మరో ట్విస్ట్.. నితీష్ సర్కార్‌లో మొదలైన ముసలం..
Bihar Political Corridor
Sanjay Kasula
|

Updated on: Jan 04, 2023 | 8:31 AM

Share

బీహార్ పొలిటికల్ కారిడార్‌లో బీటలు వారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సుధాకర్ సింగ్ ప్రకటనపై జేడీయూ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవైపు నితీష్ కుమార్ విషయంలో సుధాకర్ సింగ్ నిరంతరం వివాదాస్పద ప్రకటనలు ఇస్తూనే.. మరోవైపు ఉపేంద్ర కుష్వాహా పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.  సుధాకర్ సింగ్ వ్యాఖ్యలకు ఉపేంద్ర కుష్వాహ కూడా కామెంట్ చేశారు. రాజకీయ రంగంలో లేదా రాజకీయేతర రంగంలో నితీష్ కుమార్ కోసం కూటమి.. రాజకీయ పార్టీ లేదా మరెవరి కోసం కూడా ఇలాంటి పదాలు వాడుతున్నారని.. ఇది సరికాదని హితవు పలికారు. మహాకూటమికి మాత్రమే కాదు.. రాబోయే తరం రాజకీయాల్లో ఎలాంటి వాళ్లు ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చన్నారు.  బీహార్ ప్రజలు ఎవరికి అత్యధిక సార్లు సీఎం అయ్యే అవకాశం ఇచ్చారో తెలుసన్నారు.

సుధాకర్ సింగ్ ఇచ్చిన ప్రకటనపై మహాకూటమిలో చీలిక వస్తుందా అన్న ఓ ప్రశ్నకు ఉపేంద్ర కుష్వాహ సూటిగా సమాధనం ఇచ్చారు. చీలిక వచ్చినా రాకున్నా ఫలితం మాత్రం తీవ్రంగా ఉంటుందని అన్నారు. ఇలాంటి వాటిపై స్పందించాలని, అప్పుడే తనలోని అంతరంగాన్ని అణచివేసుకున్నట్లు అనిపిస్తోందని అన్నారు. సుధాకర్‌ సింగ్‌ ప్రకటనతో తాను బాధపడ్డానని, అయితే దానికంటే ఎక్కువగా తన వ్యక్తిగత విషయం ఇందులో ఉందన్నారు. ఆర్‌జేడీ నుంచి తన డిఫెన్స్‌లో అధికారిక ప్రకటన రావడంతో నా మనసు బాధపడిందని ఉపేంద్ర కుష్వాహ అన్నారు.

ఆర్జేడీకి తేజస్వీ యాదవ్‌ అతిపెద్ద నాయకుడని ఉపేంద్ర కుష్వాహా అన్నారు. లాలూ యాదవ్ అనారోగ్యంతో ఉన్నారు. తేజస్వికి మాట్లాడే హక్కు ఉంది కాబట్టి చూడమని అడిగాం. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి..  అంతే కాదు ఆయన నాకు అన్నయ్య లాంటి వాడు. వారి గురించి ఎవరైనా వ్యాఖ్యానిస్తే నేను సహించలేనన్నారు. కుటమిలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామలపై జాతీయ మీడియా ఓ అంచనాకు వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం