ఆ రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే రూ.50 వేల బాండ్, పేదలకు రూ.5 లకే భోజనం.. బీజేపీ వరాల జల్లు

మళ్లీ తామే అధికారంలోకి వస్తే.. అడవి బిడ్డలు .. ఆదివాసీలకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని తెలిపింది. మహిళను ఆకట్టుకునే విధంగా అనేక వరాల జల్లు కురిపించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కుటుంబంలో ఆడపిల్లలు పుట్టిడితే బాలికా సమృద్ధి పథకం కింద ప్రతి కుటుంబానికి రూ. 50,000 బాండ్ ఇస్తామని పేర్కొంది

ఆ రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే రూ.50 వేల బాండ్, పేదలకు రూ.5 లకే భోజనం.. బీజేపీ వరాల జల్లు
Bjp Manifesto
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 15, 2023 | 1:31 PM

ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో మళ్ళీ అధికారం అందుకోవడానికి బీజేపీ దృష్టి సారించింది. ప్రజలను.. ముఖ్యంగా మహిళలను.. తమపై కోపంగా ఉన్న ఆదివాసీలను ఆకట్టుకునే విధంగా వరాలు కురిపించింది. ఆదివాసీల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతకు అడ్డుకట్ట వేయడానికి..  వరసగా  రెండోసారి అధికారాన్ని అందుకునే విధంగా ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. ప్రజలపై ఉచితాలతో కూడిన హామీల వర్షాన్ని కురిపించింది. ఈనెల 16న త్రిపుర అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ   ‘సంకల్ప్ పత్ర’ పేరుతో రూపొందించిన  మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. అగర్తలలోని రవీంద్ర శతబర్షికి భవన్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా మేనిఫెస్టోను విడుదల చేశారు.

రాష్ట్రంలో మళ్లీ తామే అధికారంలోకి వస్తే.. అడవి బిడ్డలు .. ఆదివాసీలకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని తెలిపింది. త్రిపుర జనజాతి బికాష్ కింద ప్రతి గిరిజన కుటుంబానికి రూ. 5,000 వార్షిక ఆర్థిక సహాయం అందిస్తామని.. ఆదివాసీ ప్రాంత స్వయం ప్రతిపత్తి మండలిని పునర్‌వ్యవస్థీకరిస్తామని పేర్కొంది. అంతేకాదు ఆదివాసీలకు మరింత చట్టపరమైన, పాలన, ఆర్థిక అధికారాలు అప్పగిస్తామని  జె.పి.నడ్డా ప్రకటించారు. అంతేకాదు.. మహారాజా విక్రమ్‌ మాణిక్య పేరిట ఆదివాసీ విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేస్తామని హామినిచ్చారు.

మరోవైపు మహిళను ఆకట్టుకునే విధంగా అనేక వరాల జల్లు కురిపించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కుటుంబంలో ఆడపిల్లలు పుట్టిడితే బాలికా సమృద్ధి పథకం కింద ప్రతి కుటుంబానికి రూ. 50,000 బాండ్ ఇస్తామని చెప్పారు. అంతేకాదు ముఖ్యమంత్రి యువ యోగా యోగ్ యోజన కింద ప్రతిభావంతులైన కళాశాలలకు వెళ్లే సుమారు  50 వేల  మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు, ఉచిత స్కూటీని అందజేస్తామని హామీ ఇచ్చారు. గృహిణులకు రెండు ఎల్పీజీ సిలిండర్లు, పిడిఎస్ లబ్ధిదారులందరికీ బియ్యం , గోధుమలు ఉచితంగా ఇస్తామన్నారు. రాష్ట్రంలో భూమిలేనివారికి పట్టాభూమి పంపిణీ చేస్తామని నడ్డా చెప్పారు. పీఎం కిసాన్‌ కింద రైతులకు అందిస్తున్న సాయాన్ని రూ.6వేల నుంచి రూ.8వేలకు పెంచుతామన్నారు. భూమిహిన్ కిసాన్ వికాస్ యోజన కింద భూమిలేని రైతులందరికీ ₹ 3,000 వార్షిక ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. పేదలకు రూ.5 లకె భోజనాన్ని అందించనున్నామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

వచ్చే 2025 నాటికి అర్బన్, వచ్చే 2024 నాటికి జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి కుటుంబానికి వార్షిక పరిమితిని ₹ 5 లక్షల నుండి ₹ 10 లక్షలకు రెట్టింపు చేయడం వంటివి కూడా మ్యానిఫెస్టోలో చేర్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..