ఆ రాష్ట్రంలో గన్ లైసెన్స్ తీసుకునేవారికి షాక్.. 10 మొక్కలు నాటితేనే!
పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా జిల్లాలో గన్ లైసెన్స్ తీసుకునేవారికి షాక్ ఇచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇకపై గన్ లైసెన్స్ తీసుకునేవారికి అక్కడి యంత్రాంగం ఓ కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. 10 మొక్కలు నాటిన వారికే గన్ లైసెన్స్ ఇస్తామని..

పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా జిల్లాలో గన్ లైసెన్స్ తీసుకునేవారికి షాక్ ఇచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇకపై గన్ లైసెన్స్ తీసుకునేవారికి అక్కడి యంత్రాంగం ఓ కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. 10 మొక్కలు నాటిన వారికే గన్ లైసెన్స్ ఇస్తామని వెల్లడించింది. ట్రీస్ ఫర్ గన్స్ విధానం ప్రకారం పాటియాల ప్రజలు తుపాకీ లైసెన్స్ పొందడానికి 10 మొక్కలను నాటాలని డివిజనల్ కమిషనర్ చందర్ గైండ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాటియాలలో పచ్చదనాన్ని పెంచేందుకు ఈ విధానం ప్రవేశ పెట్టినట్లు ఆయన వివరించారు. పత్తి మినహా ఏవైనా చెట్లు నాటవచ్చని వెల్లడించారు. ఒక నెల పాటు పెంచి, సంరక్షించిన తర్వాతే ఆ మొక్కలతో కలిసి ఫొటో దిగి సమర్పించాలని అన్నారు. ఆ తర్వాతే గన్ లైసెన్స్ ప్రక్రియ ప్రారంభమవుతుందని డివిజనల్ కమిషనర్ చందర్ గైండ్ చెప్పారు.
Read More:
మొద్దు శ్రీను హంతకుడు అనారోగ్యంతో కాదు, కరోనాతోనే మృతి
వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్! శాశ్వతంగా నోటిఫికేషన్లు మ్యూట్ చేసేలా..



