AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID Vaccine : దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ విజయవంతం.. తొలి రోజు 1,91,181 మంది టీకా..

దేశవ్యాప్తంగా తొలిరోజు వ్యాక్సినేషన్‌ విజయవంతమైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం తొలి రోజు విజయవంతంగా ముగిసినట్టు తెలిపింది. తొలి రోజు 1,91,181 మంది టీకా...

COVID Vaccine : దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ విజయవంతం.. తొలి రోజు 1,91,181 మంది టీకా..
Sanjay Kasula
|

Updated on: Jan 16, 2021 | 9:35 PM

Share

COVID Vaccine : దేశవ్యాప్తంగా తొలిరోజు వ్యాక్సినేషన్‌ విజయవంతమైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం తొలి రోజు విజయవంతంగా ముగిసినట్టు తెలిపింది. తొలి రోజు 1,91,181 మంది టీకా తీసుకున్నారని వెల్లడించింది. ఈ రోజు టీకా తీసుకున్నవారిలో ఎవరూ అనారోగ్యానికి గురికాలేదని స్పష్టం చేసింది. శనివారం 3,351 కేంద్రాల్లో జరిగిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని వెల్లడించింది. ఈ రోజు 12 రాష్ట్రాల్లో కొవాగ్జిన్‌, మరో 11 రాష్ట్రాల్లో కొవిషీల్డ్‌ టీకా వేసినట్టు తెలిపింది.

టీకా పంపిణీ కార్యక్రమంపై భారత సైన్యం ప్రకటన విడుదల చేసింది. సైనిక ఆస్పత్రుల్లో పనిచేసే 3వేల మందికి పైగా వైద్య సిబ్బంది తొలి డోసు వేయించుకున్నట్టు తెలిపింది. మరోవైపు, దేశవ్యాప్తంగా జరిగిన వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ అన్ని రాష్ట్రాలు… కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో సమీక్షించారు.

కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభంతో ఉపశమనం లభించినట్లైందని పేర్కొన్నారు. కరోనా వైరస్‌పై పోరాటం చేసేందుకు ఈ టీకాలు సంజీవనిలా దేశం ముందు నిలిచాయని తెలిపారు. కరోనా వైరస్‌కు టీకాలు రూపొందించడంలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు, టీకా పరిశ్రమలు, ట్రయల్స్‌లో పాల్గొన్నవారు తదితరుల సహకారానికి అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

త్వరలోనే బ్యాడ్మింటన్ కోర్టులో అడుగుపెడతా… సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా

ఎందరో యువ వ్యాపారవేత్తల వేదిక ‘ప్రారంభ్’.. స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Follow Us
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!