AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Civic Staff Dumping Elderly: మానవత్వమా నీ చిరునామా ఎక్కడ..? గ్రీన్ సిటీ కోసం ఫుట్ పాత్ మీద వృద్ధులను ట్రక్కులో తీసుకెళ్లి..

మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడూ.. మచ్చుకైనా లేదు చూడూ మానవత్వం ఉన్నవాడూ నేడు అని అందెశ్రీ అన్న మాట పదే పదే గుర్తు తెచ్చుకునే సంఘటనలు రోజు రోజుకీ జరుగుతూనే ఉన్నాయి. మనిషిలో మానవత్వం కనుమరుగవుతుందా..

Civic Staff Dumping Elderly: మానవత్వమా నీ చిరునామా ఎక్కడ..? గ్రీన్ సిటీ కోసం ఫుట్ పాత్ మీద వృద్ధులను ట్రక్కులో తీసుకెళ్లి..
Surya Kala
|

Updated on: Jan 31, 2021 | 10:37 AM

Share

Civic Staff Dumping Elderly: మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడూ.. మచ్చుకైనా లేదు చూడూ మానవత్వం ఉన్నవాడూ నేడు అని అందెశ్రీ అన్న మాట పదే పదే గుర్తు తెచ్చుకునే సంఘటనలు రోజు రోజుకీ జరుగుతూనే ఉన్నాయి. మనిషిలో మానవత్వం కనుమరుగవుతుందా అని అనిపించే సంఘటనలు అనేకం చూస్తున్నాము.. ఒకప్పుడు మనిషి కష్టంలో ఉంటె కనీసం పలకరించే వారు.. కానీ ఇప్పుడు తన మన అనే బేధం లేదు.. చిన్నారులు, వృద్ధులు అనే తేడా లేదు.. అనిపించే ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మానవత్వం ఉన్న వారు ఈ వీడియో చూస్తే.. వీళ్ళు మనుషులేనా అనిపించక మానదు. వృద్ధులపై మున్సిపాల్టీ సిబ్బంది జులుం ప్రదర్శించారు. బలవంతంగా ట్రక్కుల్లో ఎక్కించి నగర శివారు ప్రాంతంలో వదిలేశారు. నడిరోడ్డుపైనే దించేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చాలని మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుని .. ముందుగా ఫుట్ పాత్ లపై ఉండే వృద్ధులను తరలించాలని అధికారులు భావించారు. ఆ వృద్ధులను బలవంతంగా ట్రక్కుల్లో ఎక్కించారు. ఆ తర్వాత..సిటీకి దూరంగా ఉండే షిప్రా గ్రామంలోని రోడ్డుమీద వదిలేశారు. అసలే చలి కాలం.. పైగా వృద్ధులని చూడకుండా అలా వదిలేయడం చూసిన ఓ వక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్స్ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు.. ఈ వీడియో సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ వద్దకు చేరింది. వెంటనే మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను దేశించారు. ఇలాంటి చర్యలను సమర్ధింనని ట్విట్టర్ వేదికగా ట్విట్ చేశారు. నడిరోడ్డుపై వదిలేసిన ఆ వృద్ధులను ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ ఆశ్రమానికి తరలించారు. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ప్రతాప్ సోలంకి సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు మున్సిపల్ కార్మికులను విధులను తొలగించారు.