‘టిక్‌ టాక్’ ట్రాన్స్‌పెరెన్సీ: భారత్‌దే తొలి స్థానం

చైనా యాప్‌ ‘టిక్‌ టాక్‌’కు భారత్‌లో మంచి క్రేజ్ ఉంది. కొంతమంది తమలోని టాలెంట్‌ను బయటపెట్టేందుకు.. మరికొందరు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఈ యాప్‌ను వాడుతున్నారు. ఇక ఈ యాప్‌కు బానిసలుగా మారిన చాలా మంది తమ ప్రాణాలను సైతం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ యాప్‌లో కొంతమంది అభ్యంతరక పోస్టులు కూడా పెడుతుంటారు. దీనిపై సీరియస్ అయిన భారత ప్రభుత్వం.. 2019లో జనవరి 1 నుంచి జూన్ 30వరకు అభ్యంతకర పోస్టులు పెట్టిన వారి అకౌంట్ వివరాలు […]

'టిక్‌ టాక్' ట్రాన్స్‌పెరెన్సీ: భారత్‌దే తొలి స్థానం
Follow us

| Edited By:

Updated on: Jan 04, 2020 | 4:12 PM

చైనా యాప్‌ ‘టిక్‌ టాక్‌’కు భారత్‌లో మంచి క్రేజ్ ఉంది. కొంతమంది తమలోని టాలెంట్‌ను బయటపెట్టేందుకు.. మరికొందరు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఈ యాప్‌ను వాడుతున్నారు. ఇక ఈ యాప్‌కు బానిసలుగా మారిన చాలా మంది తమ ప్రాణాలను సైతం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ యాప్‌లో కొంతమంది అభ్యంతరక పోస్టులు కూడా పెడుతుంటారు. దీనిపై సీరియస్ అయిన భారత ప్రభుత్వం.. 2019లో జనవరి 1 నుంచి జూన్ 30వరకు అభ్యంతకర పోస్టులు పెట్టిన వారి అకౌంట్ వివరాలు ఇవ్వాలంటూ ఇటీవల టిక్‌ టాక్ సంస్థను కోరింది. భారత్‌తో పాటు ప్రపంచంలోని 27 దేశాలు ఇదే సమాచారాన్ని ఇవ్వాలని టిక్‌టాక్ యాజమాన్యాన్ని కోరారు. దానికి సంబంధించిన నివేదికను తాజాగా విడుదల చేసింది టిక్‌ టాక్ సంస్థ.

అందులో 36శాతం విఙ్ఞప్తులు భారత్ అధికారుల నుంచే వెళ్లాయి. వాటిల్లో 99 చట్టపరమైన, 8 అత్యవసర విఙ్ఞప్తులు ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది. టిక్‌టాక్ యూజర్లలో 40శాతం మంది భారతీయులే ఉండటం వల్ల భారత్‌ నుంచే ఎక్కువ విఙ్ఞప్తులు వచ్చాయని వ్యాఖ్యానించింది. వివిధ దేశ ప్రభుత్వాల నుంచి వచ్చే విఙ్ఞప్తులను తాము తీవ్రంగానే పరిగణిస్తామని ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రకటించింది. అయితే దీనిపై చైనా నుంచి ఒక్క రిక్వెస్ట్ కూడా రాలేదని ఆ సంస్థ పేర్కొంది.

యూజర్ల కామెంట్లు వివిధ దేశాల స్థానిక చట్టాలను ఉల్లంఘించే విధంగా ఉన్నాయా..? దేశాల విఙ్ఞప్తులు న్యాయ ప్రక్రియకు లోబడే ఉన్నాయా..? అన్న అంశాలను తాము పరిశీలిస్తామని తెలిపింది. భారత్ నుంచి వచ్చిన విఙ్ఞప్తుల్లో సగాని కన్నా తక్కువ కేసుల్లోనే వినియోగదారుల సమాచారాన్ని అందించినట్లు టిక్ టాక్ యాజమాన్యం పేర్కొంది. కాగా టిక్‌ టాక్ వలన చాలామంది చెడిపోతున్నారని, అందులో బూతు కంటెంట్ ఎక్కువగా ఉందని ఆ మధ్యన కొంతమంది డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొద్ది రోజుల పాటు భారత్‌లో టిక్‌ టాక్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో