రాత్రిళ్లు కీర దోస తింటున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
04 April 2025
TV9 Telugu
TV9 Telugu
ఎండలు తీవ్రంగా ఉన్నాయి కదూ! ఆ వేడి నుంచి ఉపశమనం పొందాలంటే అందుకు తగిన ఆహారం తీసుకోవాలి. లేదంటే శక్తి నశిస్తుంది. ఏ పనీ చేయాలనిపించదు. అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కీరదోస కాపాడుతుంది
TV9 Telugu
కీర దోస తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కీర దోసలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి
TV9 Telugu
కీర దోసలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, రాగి, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి
TV9 Telugu
కీర దోస తినడం వల్ల చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. ఇందులో ఉండే సిలికా, విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి
TV9 Telugu
కీర దోసలో ఫైబర్, నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది కడుపుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల కడుపులో భారంగా, అసౌకర్యంగా అనిపించడం ఉండదు
TV9 Telugu
దోసకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఆకలిని తగ్గించడం ద్వారా బరువును నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. దీన్ని తినడం ద్వారా అతిగా తినడం నివారించవచ్చు
TV9 Telugu
భోజనానికి 20 నిమిషాల ముందు దోసకాయ తినడం చాలా ఆరోగ్యానికి ప్రయోజనకరమని నిపుణులు అంటున్నాఉ. అయితే కొంత మంది రాత్రి భోజనం తర్వాత వీటిని సలాడ్ మాదిరి తీసుకుంటూ ఉంటారు. ఇది ఎంత మాత్రం మంచి అలవాటు కాదని హెచ్చరిస్తున్నారు
TV9 Telugu
కీర జీర్ణం కావడానికి సమయం పడుతుంది. రాత్రిపూట తినడం వల్ల జీర్ణక్రియ ఆలస్యం కావడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. కొన్నిసార్లు కడుపులో గ్యాస్, ఆమ్లత్వం ఏర్పడుతుంది. కొంతమందికి జీర్ణక్రియ కూడా సరిగా ఉండదు. ముఖ్యంగా జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు రాత్రిపూట కీర దోస తినకూడదు