బ్రేకింగ్.. కుప్పకూలిన రైల్వే స్టేషన్ బిల్డింగ్.. శిథిలాల కింద ప్రయాణికులు
వెస్ట్ బెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హౌరా-ఢిల్లీ మార్గంలో ఉన్న బర్ధమాన్ రైల్వే స్టేషన్ భవనంలోని కొంత భాగం శనివారం రాత్రి 8.10 నిమిషాలకు కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం.. వెంటనే క్షతగాత్రులను స్ధానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మరికొందరు కూడా భవనం శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటన జరిగిన కొద్ది క్షణాలకే అదే భవనంలోని […]
వెస్ట్ బెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హౌరా-ఢిల్లీ మార్గంలో ఉన్న బర్ధమాన్ రైల్వే స్టేషన్ భవనంలోని కొంత భాగం శనివారం రాత్రి 8.10 నిమిషాలకు కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం.. వెంటనే క్షతగాత్రులను స్ధానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మరికొందరు కూడా భవనం శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటన జరిగిన కొద్ది క్షణాలకే అదే భవనంలోని మరో భాగం కూడా కూలింది. అయితే అప్పటికే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు.. ప్రయాణికులను ఘటనా స్థలి నుంచి దూరంగా పంపించారు. దీంతో ఎవరికీ ఎలాంటి హానీ కలుగలేదు. స్టేషన్ భవనంలోని రెండు అంతస్తుల్లో రిపేరింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
West Bengal: A portion of a building at Barddhaman Railway Station has collapsed. No casualty or injury reported till now. More details awaited. pic.twitter.com/KQzBSBL9Jb
— ANI (@ANI) January 4, 2020