పౌరసత్వ చట్టంపై మోదీ సోదరుని మాట

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ పౌరసత్వ చట్ట సవరణపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. కాంగ్రెస్ హయాంలో రూపొందించిన చట్టంపై ఆ పార్టీ నేతలే యాగీ చేయడం వింతగా వుందన్నారు ప్రహ్లాద్ మోదీ. గాంధీ మాటలకు అనుగుణంగా రూపొందిన సీఏఏని గాంధీ వారసులుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించడం, తప్పుడు ప్రచారంతో ముస్లింలను రెచ్చగొట్టడం గర్హనీయమని ఆయన ఆరోపించారు. సీఏఏకి సుప్రీం కోర్టు అనుమతి కూడా వుందన్న విషయాన్ని దాన్ని వ్యతిరేకిస్తున్న నాయకులు గుర్తించాలని ప్రహ్లాద్ […]

పౌరసత్వ చట్టంపై మోదీ సోదరుని మాట
Follow us
Rajesh Sharma

|

Updated on: Jan 04, 2020 | 4:38 PM

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ పౌరసత్వ చట్ట సవరణపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. కాంగ్రెస్ హయాంలో రూపొందించిన చట్టంపై ఆ పార్టీ నేతలే యాగీ చేయడం వింతగా వుందన్నారు ప్రహ్లాద్ మోదీ. గాంధీ మాటలకు అనుగుణంగా రూపొందిన సీఏఏని గాంధీ వారసులుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించడం, తప్పుడు ప్రచారంతో ముస్లింలను రెచ్చగొట్టడం గర్హనీయమని ఆయన ఆరోపించారు. సీఏఏకి సుప్రీం కోర్టు అనుమతి కూడా వుందన్న విషయాన్ని దాన్ని వ్యతిరేకిస్తున్న నాయకులు గుర్తించాలని ప్రహ్లాద్ మోదీ సూచించారు.

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రహ్లాద్ మోదీ శనివారం మీడియాతో మాట్లాడారు. సిఏఏను ప్రతిపక్షాలు కావాలనే విమర్శిస్తున్నాయని, దేశంలోకి వస్తున్న అక్రమ చొరబాటు దారులను అడ్డుకునేందునే సిఏఏ తీసుకొచ్చారని విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించాలని ఆయనన్నారు. సిఏఏ న్యాయపరంగా సమ్మతమేనని నిరూపించబడిందని చెప్పారు జూనియర్ మోదీ. ప్రతిపక్షాలు ముస్లింలను కావాలని రెచ్చ గొడుతున్నాయని ఆరోపించారు.

పాకిస్తాన్‌లో ఉండిపోయిన అనేకమంది హిందువులను బలవంతంగా మతం మార్చుకునేలా వేధించారని, ఇలాంటి డెబ్బై ఏళ్ళ సమస్యకు నరేంద్ర మోదీ పరిష్కారం చూపారని ప్రహ్లాద్ మోదీ అన్నారు. ఎన్నార్సీని అమలు చేయొచ్చని సుప్రీం కోర్టు చెప్పిందని, అలాంటి అంశాన్ని కూడా విపక్షాలు వ్యతిరేకిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. అనుమతి లేనిదే ఎవరి ఇంట్లోకి ఇతరులెవరు ప్రవేశించ వద్దని, సరిగ్గా అలాంటిదే సీఏఏ అని ఆయన వివరించారు.

ఇతర దేశాల నుండి ఇక్కడికి వచ్చి లీగల్‌గా స్థిరపడాలని అనుకుంటున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదని, ఇక్కడ ఉన్న ముస్లింలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పుకొచ్చారు. ఎన్పీఆర్ కూడా జనాభా లెక్కల కోసం చేయబడిందని, దాన్ని కూడా రాజకీయం చేయవద్దని విక్షాలకు ప్రహ్లాద్ మోదీ హితవు పలికారు. ఎన్పీఆర్ వల్ల దేశంలో ఉన్న అనేక మంది ఆదివాసీలకు గుర్తింపు వస్తుందని ఆయన అన్నారు.