AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ గగన్‌యాన్ ‘.. ‘ దేశీ ‘ వ్యోమగాములకు ‘ స్వదేశీ ‘ ఫుడ్ మెనూ !

ఇస్రో చేబట్టిన మానవ సహిత ‘ గగన్‌యాన్ ‘ మిషన్ లో ఇదో సరికొత్త ఇంటరెస్టింగ్ ‘ ఐటమ్ ‘.. ఈ అంతరిక్షయానం కోసం ఇప్పటికే నలుగురు పైలట్లను వ్యోమగాములుగా ఇస్రో ఎంపిక చేసిందని, రష్యాలో వారు శిక్షణ పొందనున్నారని ఈ సంస్థ చీఫ్ కె. శివన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నలుగురికీ అందించే ఆహారంపై తాజా క్లారిటీ వచ్చింది. వీరికి పప్పు, ఆలూ పరాఠాలు, చికెన్ కర్రీ, పులావ్, ఆల్మండ్స్ సహా సుమారు 22 […]

' గగన్‌యాన్ '.. ' దేశీ ' వ్యోమగాములకు ' స్వదేశీ ' ఫుడ్ మెనూ !
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 04, 2020 | 4:21 PM

Share

ఇస్రో చేబట్టిన మానవ సహిత ‘ గగన్‌యాన్ ‘ మిషన్ లో ఇదో సరికొత్త ఇంటరెస్టింగ్ ‘ ఐటమ్ ‘.. ఈ అంతరిక్షయానం కోసం ఇప్పటికే నలుగురు పైలట్లను వ్యోమగాములుగా ఇస్రో ఎంపిక చేసిందని, రష్యాలో వారు శిక్షణ పొందనున్నారని ఈ సంస్థ చీఫ్ కె. శివన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నలుగురికీ అందించే ఆహారంపై తాజా క్లారిటీ వచ్చింది. వీరికి పప్పు, ఆలూ పరాఠాలు, చికెన్ కర్రీ, పులావ్, ఆల్మండ్స్ సహా సుమారు 22 డిష్ లను సమకూర్చనున్నారు. వచ్ఛే ఏడాది ఆఖరులో..  లేదా..2022 ఆరంభంలో గగన్‌యాన్ ప్రాజెక్టును ఇస్రో చేపట్టనుంది. అయితే ఈ దేశీ ఫుడ్ మెనూ యుఎస్-నాసా నిర్దేశించిన ఆహార ప్రమాణాలకు తగినట్టుగా ఉండాలని అంటున్నారు. ఇవన్నీ కలిపి 60 కేజీల బరువుకు మించరాదని, వంద లీటర్ల నీటిని కూడా సమకూరుస్తారని తెలుస్తోంది.

మైసూరులోని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లేబొరేటరీ ఈ ఆహారాన్ని అందించనుంది. పాస్తా, పిజ్జాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. అంతరిక్షంలో వ్యోమగాములు దాదాపు వారం రోజులు గడపనున్నారు. వీరి అభిరుచికి అనుగుణంగా మెనూ సిద్డం చేస్తున్నారు. ఈ డిష్ శాంపుల్స్‌ని తాము ఇస్రోకు పంపామని, అక్కడ జీరో మైక్రోబ్స్ వంటి వాటికి ఇవి అనుగుణంగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పరీక్షిస్తారని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబ్ డైరెక్టర్ అనిల్ దత్ సెమ్వాల్ తెలిపారు. ఇస్రో ఎంపిక చేసిన పైలట్లు మొదట ఈ ఐటమ్స్ రుచి చూస్తారని, స్పైసీ తక్కువగా ఉందని వారు భావిస్తే.. వారి టేస్టుకు తగినట్టుగా మరింత స్పైసీగా ఈ ఆహార పదార్థాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. వీటిని ఉంచే పౌచెస్‌లో మైక్రోబ్స్ వంటివి ప్రవేశించకుండా డిస్పోజ్ చేయగల స్పెషల్ ప్యాకేజీలో వీటిని ప్యాక్ చేస్తారని ఆయన చెప్పారు. ఈ ప్యాకేజీలో న్యూట్రిషన్ బార్స్, పండ్ల రసాల పౌడర్, ఆల్మండ్స్, నట్స్ కూడా ఉంటాయని అనిల్ పేర్కొన్నారు.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు