SRH: ఇలా అయితే మేం..! టీమ్ స్ట్రాటజీపై కెప్టెన్ కమిన్స్ షాకింగ్ కామెంట్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో 80 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఇది వారి వరుస మూడో ఓటమి. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌లోని లోపాలను గుర్తించారు. అగ్రెసివ్ వ్యూహంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న మ్యాచ్‌లలో వ్యూహంలో మార్పులు చేయడం అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఘోరు ఓటమిని చవిచూసింది. గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్ ఏకంగా 80 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్‌కు పేరుంది. కానీ, 200 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేయలేక 120 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో వరుసగా మూడో ఓటమిని చవిచూసింది ఆరెంజ్ ఆర్మీ. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఏకంగా 286 పరుగుల భారీ స్కోర్ చేసి.. తర్వాత మూడు మ్యాచ్‌ల్లోనూ చతికిల పడింది.
వరుస ఓటములతో ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇక జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కేకేఆర్‌పై ఓటమి తర్వాత మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్ బాగానే చేసినప్పటికీ, చివర్లో రన్స్ ఇచ్చామని, ఇక మా ఫీల్డింగ్ అంత బాగా లేదని కమిన్స్ అన్నాడు. బ్యాటింగ్ విషయంలో.. మా బ్యాటర్లు ఆడిన రోజు పూర్తిగా డామినేట్ చేస్తుంటారు. కానీ, కొన్ని సార్లు పరిస్థితులు అర్థం చేసుకోవాలి. వరుసగా మూడు ఓటముల అంటే చిన్న విషయం కాదు, కచ్చితంగా మేం వెనక్కి తిరిగి చూసుకోవాలి, మేం సరిగ్గానే ఆడుతున్నామా? సరైన ఆప్షన్ ఎంచుకున్నామా అంటూ పునరాలోచించుకోవాలని కమిన్స్ అన్నాడు.
గత సీజన్ నుంచి అగ్రెసివ్ ఎటాకింగ్ గేమ్ ఆడుతున్న ఎస్‌ఆర్‌హెచ్.. దాన్నే నమ్ముకుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్‌తో అదరగొట్టి.. బ్రహ్మాండమైన స్టార్ట్ అందుకుంది. కానీ, తర్వాత మూడు మ్యాచ్‌ల్లో విఫలం అవ్వడంతో.. అసలు ఎస్‌ఆర్‌హెచ్ స్ట్రాటజీ సరైందేనా అనే డౌట్ అందరికీ వస్తోంది. ఇప్పుడు అదే డౌట్ కెప్టెన్ కమిన్స్‌కు కూడా వచ్చినట్లు అతని వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థం అవుతుంది. మరి రానున్న మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ తన పంథా మార్చుకొని, ఓవర్ అగ్రెసివ్‌గా కాకుండా.. కాస్త ఆచితూచి ఆడే అవకాశం ఉందేమో చూడాలి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




