LSG vs MI: ముంబై కాచుకో ఇక.. రూ. 8 కోట్ల ప్లేయర్ ఎంట్రీతో తొడగొట్టిన లక్నో..
LSG vs MI IPL Match Today Preview Prediction: ఐపీఎల్ 2025లో, ఏప్రిల్ 4న లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఒక మ్యాచ్ జరగనుంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో రెండు జట్లు తలపడనున్నాయి. ఇటువంటి పరిస్థితిలో, ఏ జట్టు బలంగా కనిపిస్తోంది, ఈ మ్యాచ్‌లో ఎవరు గెలవగలరు? అనేది ఓసారి చూద్దాం..

LSG vs MI IPL Match Today Preview Prediction: ఐపీఎల్ (IPL) 2025 లో 15 మ్యాచ్‌లు జరిగాయి. నేడు 16వ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు ముంబై ఇండియన్స్ (MI)తో తలపడనుంది. రెండు జట్లు ఇప్పటివరకు తలో 3 మ్యాచ్‌లు ఆడగా, ఒక్కొక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచాయి. అయితే, మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత ముంబై మూడో మ్యాచ్‌లో బలమైన పునరాగమనం చేసింది. పాయింట్ల పట్టికలో లక్నోతో సమాన పాయింట్లు కలిగి ఉన్నప్పటికీ, ముంబై ఒక స్థానం పైన ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ తన చివరి మ్యాచ్‌లో సొంత మైదానంలో ఘోరంగా ఓడిపోయింది. ఇటువంటి పరిస్థితిలో, ఏ జట్టు బలంగా కనిపిస్తోంది, ఈ మ్యాచ్‌లో ఎవరు గెలవగలరు? ఓసారి చూద్దాం..
రూ. 8 కోట్ల విలువైన బౌలర్ ఎంట్రీ..
ఈ సీజన్ తొలి మ్యాచ్ నుంచే లక్నో జట్టు కీలక బౌలర్లు లేకుండా ఆడింది. అందువల్ల జట్టు ఓటమి పాలైంది. కానీ, ఇప్పుడు 8 కోట్లకు కొనుగోలు చేసిన ఆకాష్ దీప్ ఫిట్‌గా మారి, ఎకానా స్టేడియంలో ముంబైపై బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతని రాక లక్నో బౌలింగ్ యూనిట్‌ను బలోపేతం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తొలి హోమ్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత, మెంటర్ జహీర్ ఖాన్ పిచ్‌పై తన కోపాన్ని వ్యక్తం చేశాడు. కానీ, ఆకాష్ దీప్‌ను చేర్చడంతో లక్నో సమస్య కూడా పరిష్కరామవుతుందని అంతా భావిస్తున్నారు. ఏ విధంగానైనా ముంబైని ఓడించడం ద్వారా లక్నో జట్టు సొంతగడ్డపై తొలి విజయాన్ని నమోదు చేయాలని ప్రయత్నిస్తుంది. అదే సమయంలో, ముంబై మరోసారి యువ ఆటగాళ్ల బలంతో వరుసగా రెండో విజయం కోసం ఎదురు చూస్తోంది.
హెడ్-టు-హెడ్ రికార్డులు: లక్నోదే ఆధిపత్యం..
లక్నో, ముంబై మధ్య హెడ్-టు-హెడ్ రికార్డు గురించి మాట్లాడుకుంటే, లక్నోదే పైచేయి. ఇప్పటివరకు, రెండు జట్ల మధ్య 6 మ్యాచ్‌లు జరగగా, వాటిలో లక్నో 5 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ముంబై 1 మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ఎకానా స్టేడియంలో రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరిగాయి. లక్నో రెండు సార్లు విజయం సాధించింది. చివరిసారిగా ఇక్కడ ఈ మ్యాచ్ జరిగినప్పుడు, లక్నో చివరి ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా మ్యాచ్ గెలిచింది.
LSG అత్యధిక స్కోరు: 214 పరుగులు
LSG అత్యల్ప స్కోరు: 101 పరుగులు
MI అత్యధిక స్కోరు: 196 పరుగులు
MI అత్యల్ప స్కోరు: 132 పరుగులు
ఎకానా స్టేడియం రికార్డు..
ఇప్పటివరకు ఎకానా స్టేడియంలో 15 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి.
మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది: 7 మ్యాచ్‌లు
తొలుత బౌలింగ్ చేసిన జట్లు గెలిచింది: 8 మ్యాచ్‌లు
అత్యధిక స్కోరు: 235 (2024లో LSGతో జరిగిన మ్యాచ్‌లో KKR)
అత్యల్ప స్కోరు: 108 పరుగులు (LSG vs RCB, 2023)
అత్యధిక విజయవంతమైన ఛేజింగ్: 199/3 (రాజస్థాన్ రాయల్స్ పై LSG, 2024)
లక్నోలో పిచ్ ఎలా ఉంది?
ఎకానా స్టేడియంలోని పిచ్ నల్లటి మట్టితో తయారు చేశారు. ఇది సాధారణంగా నెమ్మదిగా ఉంటుంది. భారీ స్కోర్ చేయడం కష్టతరం చేస్తుంది. అయితే, 2023 వన్డే ప్రపంచ కప్‌నకు ముందు మైదానం, పిచ్‌ను పునర్నిర్మించారు, ఆ తర్వాత బౌన్స్ పెరిగింది. కొన్ని భారీ స్కోర్‌లు కనిపించాయి. అయినప్పటికీ, ఇతర వేదికలతో పోలిస్తే ఇక్కడ పెద్ద స్కోర్లు చాలా అరుదు.
గత 6 ఐపీఎల్ మ్యాచ్‌లలో, లక్ష్యాన్ని ఛేదించిన జట్లు 5 సార్లు గెలిచాయి.
మ్యాచ్ సమయంలో మంచు కురిసే అవకాశం లేదు, ఇది బౌలర్లకు సహాయపడవచ్చు.
ప్రాబబుల్ ప్లేయింగ్-11, ఇంపాక్ట్ ప్లేయర్స్..
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, ఆకాశ్ దీప్.
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రాబిన్ మింజ్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, నమన్ ధీర్, విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, విఘ్నేష్ పుత్తూర్.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..