IPL 2025: ఎక్కువ డబ్బులిచ్చారు కదా అని..! షాకింగ్ కామెంట్స్ చేసిన 23 కోట్ల ఆటగాడు
గురువారం జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. 23.75 కోట్ల వెంకటేశ్ అయ్యర్ అద్భుతమైన 70 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. తక్కువ ధరకు ఆడుతున్నాడు అనే విమర్శలకు ఈ మ్యాచ్‌తో సమాధానం చెప్పాడు. జట్టు విజయం ముఖ్యమని, ధర ఒత్తిడిని కలిగించదని అయ్యర్ తెలిపాడు.

ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఘన విజయం సాధించింది. ఎంతో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌ను కేవలం 120 పరుగులకే ఆలౌట్ చేసి.. 80 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ తర్వాత 23.75 కోట్ల ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముందుగా బ్యాట్‌తో దుమ్మురేపిన అయ్యర్.. తర్వాత నోటితో కూడా తనపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. కేవలం 29 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. 160 పరుగులకే పరిమితం అవుతుంది అనుకున్న కేకేఆర్.. ఏకంగా 200 పరుగులకు చేరిందంటే.. అందులో వెంకటేశ్ అయ్యర్ పాత్ర ఎంతో ఉంది.
కాగా, కేకేఆర్ ఆడిన తొలి మూడు మ్యాచ్‌ల్లో అయ్యర్ కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో 6, ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలం అయ్యాడు. రాజస్థాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచినా.. అయ్యర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మొత్తంగా మూడు మ్యాచ్‌ల్లో కలిపి 9 రన్స్ మాత్రమే చేయడంతో.. ఇతనికి రూ.23.75 కోట్లు ఎందుకు దండగా అంటూ కామెంట్స్ వినిపించాయి. పైగా ఇంత భారీ ధర కూడా అయ్యర్‌పై ప్రెజర్ పెంచుతోందని కూడా కొంతమంది క్రికెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. వీటన్నింటికి అయ్యర్ గురువారం ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌తో సమాధానం చెప్పాడు.
సూపర్ బ్యాటింగ్‌తో తన సత్తా ఏంటో చూపించాడు. మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ.. “అంత డబ్బు ఇచ్చారంటే దానర్థం నేను ప్రతి మ్యాచ్‌లో బాగా ఆడాలని కాదు. అయినా ఒక్కసారి గ్రౌండ్‌లోకి దిగిన తర్వాత ఎంత డబ్బులు ఇస్తున్నారనేది కాదు.. మనం టీమ్ కోసం ఏం చేస్తామో అదే ఇంపార్టెంట్ అదే మా మైండ్‌లో ఉంటుంది. రూ.20 లక్షలైనా, రూ.20 కోట్లు అయినా.. టీమ్ కోసమే ఆడతారు. అయితే నాపై ఒత్తిడి ఉన్న మాట నిజమే.. కానీ, అది భారీ ధర వల్ల వచ్చింది కాదు.. జట్టు విజయం కోసం నేను ఏం చేయగలను అనే ఆలోచనతో వచ్చింది” అని అయ్యర్ పేర్కొన్నాడు. మొత్తంగా బ్యాట్‌తో, నోటితో అయ్యర్ ఒకే రోజు తనపై వస్తున్న విమర్శలు జవాబు చెప్పేశాడు.
Venkatesh Iyer carnage at Eden Gardens!! pic.twitter.com/FzJyELIupb
— A⁷ (@anushmita7) April 3, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..