IPL 2025: అందరికీ హెడ్‌ఏక్.. మాకు జూజూబీ! ట్రావిస్ హెడ్‌ను ఘోరంగా అవమానించిన కేకేఆర్!
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తాజా మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోర ఓటమి పాలైంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల పేలవ ప్రదర్శనతో SRH కేవలం 120 పరుగులకే పరిమితమైంది. KKR సోషల్ మీడియాలో హెడ్‌ను అవమానించింది, అతని తక్కువ స్కోర్లను ప్రస్తావించింది.

ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమిని చవిచూసింది. భయంకరమైన బ్యాటింగ్ లైనప్ ఉండి, ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే ఏకంగా 286 పరుగుల అతి భారీ స్కోర్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దారుణంగా విఫలం అయ్యారు. తొలి మ్యాచ్ అద్భుతంగా ఆడిన ఎస్‌ఆర్‌హెచ్.. ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో ఫేలవ ప్రదర్శన కనబరుస్తోంది.
కాగా, గురువారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను కేకేఆర్ అవమానించింది. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసిన తర్వాత హెడ్ అవుట్ అయ్యాడు. వెంటనే కేకేఆర్ సోషల్ మీడియా టీమ్.. “హెడ్-ఇంగ్ టువార్డ్స్ ది బిజినెస్, రైట్ ఫ్రమ్ ది స్టార్ట్” అంటూ ఓ పోస్ట్ పెట్టింది. అలాగే కేకేఆర్‌తో ఎస్‌ఆర్‌హెచ్ ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో అతను చేసిన స్కోర్లు కూడా పెట్టింది.
చివరి మూడు ఇన్నింగ్స్‌ల్లో హెడ్ 0, 0, 4 మాత్రమే చేశాడు. ఈ పోస్ట్‌తో ట్రావిస్ హెడ్ అంటే మిగతా టీమ్స్ అందరికీ హెడ్ ఏక్ ఏమో.. మాకు మాత్రం జూజూబీ అనే విషయాన్ని స్పష్టం చేసింది. ముఖ్యంగా టీమిండియాపై ట్రావిస్ హెడ్‌కు అద్భుతమైన రికార్డ్ ఉన్న విషయం తెలిసిందే. 2023లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్‌లో హెడ్ ఎలాంటి విధ్వంసకర బ్యాటింగ్ చేశాడో చూశాం. అందుకే టీమిండియాకు అతనో హెడ్ ఏక్‌గా క్రికెట్ అభిమానులు చెబుతుంటారు. కానీ, కేకేఆర్‌పై మాత్రం హెడ్‌కు అంత మంచి రికార్డ్ లేదు.
Head-ing towards the business, right from the start 🔥 pic.twitter.com/0XDCRftT1I
— KolkataKnightRiders (@KKRiders) April 3, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




