ప్రమాదానికి గురైన ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్‌.. ఇద్దరు పైలట్లతో సహా ముగ్గురు గల్లంతు

ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన హెలికాప్టర్ అరేబియా సముద్రంలో ప్రమాదానికి గురైంది. గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరంలో అరేబియా సముద్రంలో సహాయం కోసం వెళ్లిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ సముద్రంలో మునిగిపోయింది. ఈ కారణంగా ఇద్దరు పైలట్లు, ఒక డైవర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.

ప్రమాదానికి గురైన ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్‌.. ఇద్దరు పైలట్లతో సహా ముగ్గురు గల్లంతు
Indian Coast Guard Helicopter
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 03, 2024 | 12:29 PM

ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన హెలికాప్టర్ అరేబియా సముద్రంలో ప్రమాదానికి గురైంది. గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరంలో అరేబియా సముద్రంలో సహాయం కోసం వెళ్లిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ సముద్రంలో మునిగిపోయింది. ఈ కారణంగా ఇద్దరు పైలట్లు, ఒక డైవర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. హెలికాప్టర్‌లో నలుగురు వ్యక్తులు ఉండగా, అందులో ఒక వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. అరేబియా సముద్రంలో హెలికాప్టర్ శకలాలు లభ్యమయ్యాయి. ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డ వ్యక్తి కూడా డైవర్ కాగా, అతని పరిస్థితి నిలకడగా ఉంది.

అరేబియా సముద్రంలో చిక్కుకుపోయిన ఓడ నుండి సహాయం కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్‌‌కు సమాచారం అందింది. దీంతో వెంటనే కోస్ట్ గార్డ్ సిబ్బంది అక్కడికి చేరుకుంది. ఓడలో చిక్కకున్న వారిని రక్షించేందుకు సహాయచర్యలు చేపట్టారు. ఈ సమయంలో, హెలికాప్టర్ తిరిగి తీరానికి చేరుకునేటప్పుడు ప్రమాదానికి గురైంది. దీంతో ఇద్దరు ఫైలట్లు, ఒక డైవర్‌ మునిగిపోయారు. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కోస్ట్ గార్డ్ సెర్చ్ ఆపరేషన్ల కోసం నాలుగు నౌకలు, రెండు విమానాలను మోహరించాయి. త్వరలోనే ఆ ముగ్గురి ఆచూకీ లభించే అవకాశం ఉందని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.

ఇండియన్ కోస్ట్ గార్డ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, “ఇండియన్ కోస్ట్ గార్డ్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ ఇటీవల గుజరాత్‌లో తుఫాను వాతావరణంలో 67 మంది ప్రాణాలను రక్షించింది. సోమవారం(సెప్టెంబర్ 2) రాత్రి 11.00 గంటలకు, భారత ఫ్లాగ్డ్ మోటార్ ట్యాంకర్‌ ఆరేబియా సముద్రంలో చిక్కుకుంది. పోర్ బందర్ తీరానికి 45 కి.మీ దూరంలో సముద్రంలో ఉంది. ఓడ మాస్టర్ సహాయం కోసం అభ్యర్థించారు. తీవ్రంగా గాయపడిన సిబ్బందిని రక్షించి వైద్య చికిత్స కోసం తరలించేందుకు పంపారు. అయితే హెలికాప్టర్ తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని” ఇండియన్ కోస్ట్ గార్డ్ పేర్కొంది.

హెలికాప్టర్‌లో నలుగురు సిబ్బంది ఉన్నారు. ఆపరేషన్ సమయంలో హెలికాప్టర్‌ను బలవంతంగా సముద్రంలో దింపారు. ఒక సిబ్బందిని రక్షించారు. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. ప్రస్తుతం, భారత తీర రక్షక దళానికి చెందిన నాలుగు నౌకలు, రెండు విమానాలతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

ప్రస్తుతం గుజరాత్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో వరదలు ముంచెత్తేత్తున్నాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ పోర్ బందర్, ద్వారకలో రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ఇక్కడ 33 మందిని హెలికాప్టర్ ద్వారా రక్షించారు. ఈదురు గాలులు, కుండపోత వర్షాల కారణంగా చిక్కుకున్న వారిలో ఇప్పటివరకు 60 మందికి పైగా ప్రాణాలు కాపాడారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..