కొవిడ్ విషయంలో మనం బెటరే
భారతదేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ లెక్కలు చెబుతోంది. గత ఐదు నెలల కాలంలో మొత్తం కరోనావైరస్ కేసులలో మూడింట నాలుగు వంతులు కోలుకున్నవేనని తెలిపింది.
భారతదేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ లెక్కలు చెబుతోంది. గత ఐదు నెలల కాలంలో మొత్తం కరోనావైరస్ కేసులలో మూడింట నాలుగు వంతులు కోలుకున్నవేనని తెలిపింది. దేశం మొత్తంలో నమోదైన కొవిడ్-19 కేసులలో ప్రస్తుతం నాలుగవ వంతు కంటే తక్కువగానే యాక్టివ్ లో ఉన్నాయని వెల్లడించింది. కేంద్రం వ్యూహాత్మక.. గ్రేడెడ్ టెస్ట్-ట్రాక్-ట్రీట్ విధానాన్ని అమలు చేయడం ద్వారా భారతదేశంలో కరోనా మహమ్మారిని అరికట్టడం సాధ్యమైందని అభిప్రాయపడింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలా ఉండగా, తాజా సమాచారం ప్రకారం యావత్ భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 33లక్షల 87 వేల 5వందలు నమోదవ్వగా, ఈ సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 2కోట్ల 42లక్షల 88వేల 572కు చేరింది.