Telangana: పిడుగు పాటుకు ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి.. మరో రెండు రోజుల పాటు అలెర్ట్‌..!

మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని పాలజ్ గ్రామ శివారులో రైతులు పొలం పనులు చేస్తున్నారు. చినుకులతో మొదలైన వాన ఒక్కసారిగా జోరందుకుంది. ముగ్గురు రైతులు సమీపంలో ఉన్న చెట్టు

Telangana: పిడుగు పాటుకు ముగ్గురు వ్యవసాయ కూలీలు  మృతి.. మరో రెండు రోజుల పాటు అలెర్ట్‌..!
Thunderstorm
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 21, 2022 | 8:46 PM

నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. కుబీర్ మండలానికి అనుకోని ఉన్న మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని పాలజ్ గ్రామ శివారులో రైతులు పొలం పనులు చేస్తున్నారు. చినుకులతో మొదలైన వాన ఒక్కసారిగా జోరందుకుంది. ముగ్గురు రైతులు సమీపంలో ఉన్న చెట్టు కిందకి వెళ్లారు. కాసేపటికి వారు నిలుచున్న చెట్టు మీద పిడుగు పడడంతో గ్రామానికి చెందిన సాయినాథ్, రాజు, బోజన్న అనే ముగ్గురు రైతులు మృత్యువాతపడ్డారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తెలంగాణ ప్రజలకు వాతావారణ శాఖ అలెర్ట్. ఇప్పటికే దంచికొడుతున్న వర్షాలు మరో 2 రోజులు కంటిన్యూ అవ్వనున్నాయి.  రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. గురవారం కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు వ్యాపించిన  ఉపరితల ద్రోణి బలహీనపడిందని… గాలులు నైరుతి నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దీనితో పాటు నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా ఉంది. దీంతో మంగళ, బుధ గురువారాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.