బాబోయ్ ఈ చదువులు మా వల్ల కావు.. ఐఐటీ, ఎన్‌ఐటీలను మధ్యలోనే వదిలేస్తున్న వేలాదిమంది విద్యార్థులు

దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో సీటు సాధించాలని చాలామంది విద్యార్థులు కోరుకుంటారు. ఇందులో సీటు పొందలంటే పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిందే. ప్రతిఏడాది ఈ జైఈఈ పరీక్షల లక్షలాది మంది విద్యార్థులు పోటీపడుతుంటారు.

బాబోయ్ ఈ చదువులు మా వల్ల కావు.. ఐఐటీ, ఎన్‌ఐటీలను మధ్యలోనే వదిలేస్తున్న వేలాదిమంది విద్యార్థులు
Student
Follow us
Aravind B

|

Updated on: Jul 27, 2023 | 5:55 PM

దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో సీటు సాధించాలని చాలామంది విద్యార్థులు కోరుకుంటారు. ఇందులో సీటు పొందలంటే పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిందే. ప్రతిఏడాది ఈ జైఈఈ పరీక్షల లక్షలాది మంది విద్యార్థులు పోటీపడుతుంటారు. అయితే ఇంత కఠినమైన ప్రక్రియలను దాటుకొని వెళ్లి సీటు పొందినప్పటికీ.. కొందమంది విద్యార్థులు మధ్యలోనే ఆ చదువులు మానేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. 2019 నుంచి 2023 మధ్య కాలంలో దాదాపు 8 వేల మందికి పైగా ఐఐటీ విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపేశారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి సుభాస్ సర్కార్ రాజ్యసభలో పేర్కొన్నారు. అలాగే 2018 నుంచి ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో దాదాపు 98 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.

ఆత్మహత్య చేసుకున్న వారిలో 39 మంది ఐఐటీలో చదువుకున్న విద్యార్థులే. అలాగే ఎన్‌ఐటీలో 25. సెంట్రల్ యూనివర్శిటీల్లో 25, ఐఐఎంల్లో 4, ఐఐఎస్‌ఈఆర్‌ల్లో ముగ్గురు చనిపోయినట్లు తెలిపారు. అలాగే ట్రిపుల్ ఐటీల్లో కూడా ఇద్దరు మృతి చెందినట్లు పేర్కొన్నారు. అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం.. ఈ విద్యార్థులు మానసికంగా బాధపడటం, కుటుంబ సమస్యలు, చదువుల్లో ఒత్తిడి, ఒంటరివారమనే భావన వల్లే ఆత్మహత్యలు చేసుకున్నట్లు వెల్లడించారు. అలాగే సెంట్రల్ యూనివర్సిటీల్లో 17,457 మంది మధ్యలోనే చదువు మానేశారని మంత్రి పేర్కొన్నారు. అలాగే ఐఐటీల్లో 8,139, ఎన్‌ఐటీల్లో 5,623 మంది, ఐఐఎస్‌ఈఆర్‌ల్లో 1,046 మంది మధ్యలోనే మానేసినట్లు పేర్కొన్నారు. ఐఐఎంల్లో 858, ట్రిపుల్‌ ఐటీల్లో 803 మంది విద్యార్థులు మధ్యలోనే ఆపేసినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..