ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండించిన ఉపాధ్యాయ రైతు.. కిలో ధర రూ. 2.5-3 లక్షలు

ఇది ఒక ప్రత్యేకమైన మామిడి. ఎందుకంటే, ఇందులో విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి. ప్రత్యేకమైన రుచి కూడా ఉంటుంది. ఇది అనేక రకాలైన వ్యాధుల నుండి మనలను రక్షిస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్, డైటరీ ఫైబర్, పొటాషియం కలిగి ఉంటుందని నిపుణులు, రైతు చెప్పారు. ఇకపోతే,

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండించిన ఉపాధ్యాయ రైతు.. కిలో ధర రూ. 2.5-3 లక్షలు
Most Expensive Mango
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 27, 2023 | 5:58 PM

ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన ఓ రైతు..అతడు వృత్తిరిత్యా ఉపాధ్యాయుడు కూడా..విద్యార్థులకు పాఠాలు భోదించే ఈ రక్ష్యకర్ భోయి అనే ఈ రైతు.. తన తోటలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకం ‘మియాజాకి’ని పండించినట్లు పేర్కొన్నారు. మియాజాకి మామిడి దాని ప్రత్యేక రుచి, ఆహార విలువ కారణంగా ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ 2.5 లక్షల నుండి రూ.3 లక్షల వరకు ధర పలుకుతుంది.

నివేదికల ప్రకారం, ధరమ్‌ఘర్ సబ్‌డివిజన్‌లోని కందుల్‌గూడ గ్రామానికి చెందిన మామిడి రైతు భోయి తన వ్యవసాయ భూమిలో వివిధ జాతుల మామిడిని పండిస్తున్నాడు. రాష్ట్ర ఉద్యానవన శాఖ ద్వారా విత్తనాన్ని సేకరించిన తర్వాత అతను తన తోటలో ‘మియాజాకి’ రకాన్ని నాటాడు. ‘మియాజాకి’ రకం మామిడి నిజానికి జపనీస్ జాతి. దాని విలక్షణమైన రుచి, వైద్య విలువ కారణంగా ఐరోపా, ఇతర అభివృద్ధి చెందిన ఖండాలలో దీనికి భారీ డిమాండ్ ఉంది.

ఇది ఒక ప్రత్యేకమైన మామిడి. ఎందుకంటే, ఇందులో విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి. ప్రత్యేకమైన రుచి కూడా ఉంటుంది. ఇది అనేక రకాలైన వ్యాధుల నుండి మనలను రక్షిస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్, డైటరీ ఫైబర్, పొటాషియం కలిగి ఉంటుందని నిపుణులు, రైతు చెప్పారు. ఇకపోతే, ‘మియాజాకి’ మరో పేరు ‘రెడ్ సన్’, బెంగాలీ ‘సుర్జా డిమ్’ అని కూడా అంటారు. అయితే, ఈ ప్రాంతంలో ఈ రకాలను పెంచేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా