యూపీ లోని ఆలయంలో ‘లడ్డూ మార్ హోలీ’, కిక్కిరిసిన జనాలు, మాస్కులేవీ ? ఇదేం భక్తి ?
యూపీలోని బర్సానాలో గల శ్రీ రాధారాణి ఆలయంలో ఓ వేడుకకు వేలాది భక్తులు హాజరయ్యారు. ఈ నెలాఖరులో జరగనున్న రంగుల పండుగ..హోళీ సందర్భంగా ఈ గుడిలో విశిష్టమైన ఉత్సవం వంటిది నిర్వహించారు.
యూపీలోని బర్సానాలో గల శ్రీ రాధారాణి ఆలయంలో ఓ వేడుకకు వేలాది భక్తులు హాజరయ్యారు. ఈ నెలాఖరులో జరగనున్న రంగుల పండుగ..హోళీ సందర్భంగా ఈ గుడిలో విశిష్టమైన ఉత్సవం వంటిది నిర్వహించారు. ఆలయ సిబ్బంది గుడి మొదటి అంతస్థులో నిలబడి బుట్టల్లో లడ్డూలు పెట్టుకుని కిందకు విసురుతుండగా వాటి కోసం భక్తులు, ప్రజలు ఎగబడ్డారు. ఒక్కసారిగా వేలమంది అక్కడికి చేరుకోవడంతో తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడింది. వీరిలో మహిళలు, వృధ్దులు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ అసంఖ్యాక ప్రజలను అదుపు చేసేవారే లేకపోయారు. దేశంలో మళ్ళీ కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో వీరిలో ఒక్కరైనా మాస్కు ధరించక పోవడం విశేషం. భౌతిక దూరం పాటింపు అసలే లేదు. సుమారు ఒకటిన్నర నిముషం నిడివి గల ఈ వీడియోను ఆలయ సిబ్బంది విడుదల చేశారు. కనీసం వారు కూడా మాస్కులు ధరించలేదు.
మథుర, బర్సానా వంటి నగరాల్లో’ లాత్ మార్ హొలీ ‘అనే ఉత్స్సవాన్ని జరుపుకోవడానికి ముందు ‘లడ్డూ మార్ హొలీ’ ని నిర్వహిస్తారు. నిజానికి ఈ విధమైన పండుగల సందర్భంలో చాలామంది ఒక చోట గుమి కూడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. దేశంలో మళ్ళీ కోవిడ్ మహమ్మారి వ్యాపిస్తోంది. సుమారు 15 రాష్ట్రాల్లో తిరిగి ఇది మొదలైంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, నిర్లక్ష్యం మరీ మితిమీరడం వల్ల ఇది మళ్ళీ విజృంభిస్తోంది. ఆయా ప్రభుత్వాలు ఎన్ని హెచ్ఛరికలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో హోళీ వంటి పండుగలను ఆర్భాటంగా జరుపుకుంటారు. అయితే ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న హెచ్ఛరికలను ప్రజలు పాటిస్తున్న దాఖలాలు కామనబడడంలేదు .
మరిన్ని చదవండి ఇక్కడ : నవీన్ పొలిశెట్టిగా..అంటూ వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ..జాతిరత్నాల మధ్య చిచ్చు..:warning to Naveen Polishetty Video.
ఈ చింపాంజీ చేష్టలు చూస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ వీడియో : chimpanzee antics funny video
వామ్మో.. లేడీ కాదు..పెద్ద కిలాడీ ! ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది : Lady Married 18 Mens Video.