ఇది ట్రక్కు కాదు… రాకెట్ లాంచర్.. నాటి సైన్యానికి ‘వెపన్’
ఆరు చక్రాల రోడ్ ట్రక్కులు గతంలో ఎక్కడపడితే అక్కడ ఇండియాలో కనిపించేవి. అత్యంత దృఢంగా ఉండే ఈ వాహనాలను భారీ యంత్రాలను తీసుకువెళ్లేందుకు ఉపయోగించేవారు. అయితే క్రమేపీ..

ఆరు చక్రాల రోడ్ ట్రక్కులు గతంలో ఎక్కడపడితే అక్కడ ఇండియాలో కనిపించేవి. అత్యంత దృఢంగా ఉండే ఈ వాహనాలను భారీ యంత్రాలను తీసుకువెళ్లేందుకు ఉపయోగించేవారు. అయితే క్రమేపీ ఇవి కనుమరుగయ్యాయి. కానీ ఈ మధ్యే ఇలాంటి వాహనం కేరళలో కనిపించింది. అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలనాటి సోవియట్ యూనియన్ లో తయారైన ఈ వాహనం విశేషాలు చాలానే ఉన్నాయి. దీని టైర్లపై నాటి సోవియట్ ప్రభుత్వ ముద్రలు ఉన్నాయి. ఎత్తయిన ప్రదేశాలను కూడా సునాయాసంగా ప్రయాణించగలదని, ఏడు టన్నులకు పైగా బరువును మోయగలదని వాహన నిపుణులు చెబుతున్నారు. ముఖ్య విశేషమేమిటంటే ఇండియన్ ఆర్మీ ఈ వాహనాన్ని రాకెట్ లాంచర్ గా వినియోగించుకునేదట. అందుకే దీన్ని ‘మొబైల్ రాకెట్ లాంచర్’ అని అభివర్ణిస్తున్నారు.
రెండో ప్రపంచ యుధ్ధ సమయంలో ఈ విధమైన వాహనాలను ఎక్కువగా వాడేవారు. అయితే ఆ తరువాత ఇవి ‘అంతరించిపోయాయి’. మాజీ సైనికులు కొందరు ఈ వాహనాన్ని చూసి.. అలనాటి తమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.



