RaviTeja: రవితేజ సినిమాలో విలన్‌గా ప్రముఖ నటుడు.. ‘సరిపోదా శనివారం’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక క్రేజీ కాంబినేషన్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది. ఒకవైపు ఎనర్జీకి మారుపేరైన మాస్ మహారాజా, మరోవైపు తన విలక్షణ నటనతో హీరోల కంటే ఎక్కువ మార్కులు కొట్టేస్తున్న వర్సటైల్ యాక్టర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా.

వీరిద్దరూ తలపడితే వెండితెరపై మంటలు పుట్టడం ఖాయం. అది కూడా ఒక డిఫరెంట్ హారర్ జానర్‌లో ఈ పోరు జరగబోతోందని తెలియడంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అయింది. ‘సరిపోదా శనివారం’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఆ దర్శకుడు ప్లాన్ చేసిన ఈ భారీ ప్రాజెక్టులో ఆ తమిళ స్టార్ నటుడు విలన్‌గా రాబోతున్నారట. రవితేజ పవర్‌ఫుల్ ఎనర్జీని ఢీకొట్టే ఆ విలన్ ఎవరు? వివేక్ ఆత్రేయ మైండ్ గేమ్ ఈసారి ఎలా ఉండబోతోంది?
ఎస్‌జే సూర్య ఎంట్రీ
మాస్ మహారాజా రవితేజ నటించనున్న తాజా హారర్ చిత్రంలో ప్రముఖ దర్శకుడు మరియు నటుడు ఎస్‌జే సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. తెలుగులో ఇప్పటికే ‘స్పైడర్’, ‘సరిపోదా శనివారం’ సినిమాలతో విలనిజంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారాయన. ముఖ్యంగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ‘సరిపోదా శనివారం’లో ఆయన పోషించిన దయా పాత్ర ఎంతటి ప్రభావాన్ని చూపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే దర్శకుడితో, ఈసారి రవితేజను ఢీకొట్టేందుకు సూర్య సిద్ధమవుతుండటం ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

Raviteja N Sj Surya
కథ మరియు స్క్రీన్‌ప్లే పరంగా వివేక్ ఆత్రేయది ఒక ప్రత్యేకమైన శైలి. ఇప్పటివరకు లవ్ స్టోరీస్, క్రైమ్ కామెడీలు, యాక్షన్ థ్రిల్లర్లతో మెప్పించిన వివేక్, ఇప్పుడు మొదటిసారిగా హారర్ జానర్‌ను ఎంచుకోవడం విశేషం. రవితేజను ఎప్పుడూ చూడని ఒక కొత్త కోణంలో ఈ సినిమాలో చూపించబోతున్నారట. రవితేజ మార్క్ ఎనర్జీకి, వివేక్ ఆత్రేయ రాసే ఇంటెన్సిటీ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తారుమారు అవ్వడం ఖాయం.
రవితేజ ఇటీవల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ తో సంక్రాంతి బరిలో నిలిచి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. జనవరి 13న విడుదలైన ఆ సినిమాతో ఫుల్ జోష్‌లో ఉన్న రవితేజ, ఇప్పుడు ప్రయోగాత్మకమైన హారర్ కథను అంగీకరించడం చర్చనీయాంశంగా మారింది. వివేక్ ఆత్రేయ చెప్పిన కథకు రవితేజ బాగా ఇంప్రెస్ అయ్యారని, అందుకే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. రవితేజ ఎనర్జీ, ఎస్‌జే సూర్య విలనిజం కలిస్తే థియేటర్లలో పూనకాలు రావడం గ్యారెంటీ అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
