Royal Enfield: భర్త ఇచ్చిన గిఫ్ట్‌ బుల్లెట్‌పై తల్లీకూతురు బైక్‌ ట్రిప్‌.. కేరళ టూ కశ్మీర్‌..!

Royal Enfield: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. ఈ బైక్‌ ప్రయాణమే వేరు. ఈ బైక్‌ను నడపాలని ఎంతో మందికి ఆశ ఉంటుంది. మార్కెట్లో ఎన్ని రకాల బైక్‌లు వచ్చినా.. ఈ బైక్‌కు ఉన్న క్రేజే వేరు...

Royal Enfield: భర్త ఇచ్చిన గిఫ్ట్‌ బుల్లెట్‌పై తల్లీకూతురు బైక్‌ ట్రిప్‌.. కేరళ టూ కశ్మీర్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: Jul 24, 2021 | 12:16 PM

Royal Enfield: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. ఈ బైక్‌ ప్రయాణమే వేరు. ఈ బైక్‌ను నడపాలని ఎంతో మందికి ఆశ ఉంటుంది. మార్కెట్లో ఎన్ని రకాల బైక్‌లు వచ్చినా.. ఈ బైక్‌కు ఉన్న క్రేజే వేరు. ఈ బైక్‌ అంటేనే నడిపేందుకు ఎగిరి గంతులేస్తుంటారు. అంతేకాదు ఈ బైక్‌ యువతకే కాకుండా మహిళలకు అంటే కూడా ఎంతో ఇష్టం. ఈ బైక్‌ను నడపాలని ఉండే మహిళలు కూడా ఉంటారు. ఎంతో ఇష్టపడే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై ఓ తల్లీ, కూతురు టూర్‌లో మునిగితేలిపోతున్నారు. వివరాల్లోకి వెళితే..

తన పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా భర్త మధుధుసూదనన్‌ బహుమతిగా ఇచ్చిన బుల్లెట్‌ బైక్‌ తో భార్య అనీషా, తన కుమార్తె మధురిమతో కలిసి కేరళ నుంచి కశ్మీర్‌కు బైక్‌ ట్రిప్‌కు బయలుదేరారు. మణియారాకు చెందిన అనీషా కనై నార్త్‌ యూపీ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్నారు. అయితే భర్త ఇచ్చిన బైక్‌ బహుమతితో అనీషా, కుమార్తె మధురిమ బైక్‌పై బయలుదేరారు. మధురిమ పయ్యన్నూర్‌ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. మధుసూదనన్‌ గత సంవత్సరం వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రయాణం కోసం ఇష్టపడే బుల్లెట్‌ బైక్‌ను అనీషాకు బహుమతిగా ఇచ్చారు. ఇక బహుమతిగా అందుకున్న బైక్‌పై తల్లీకూతురు కేరళ నుంచి కశ్మీర్‌ పర్యటకు బయలుదేరింది. తల్లి, కుమార్తె గూగుల్‌ మ్యాప్‌లో కశ్మీర్‌కు వెళ్లే మార్గాన్ని చూసుకుని బయలుదేరారు. అయితే గత సంవత్సరమే వారి టూర్‌ ఉండగా, కోవిడ్‌ ఆంక్షల కారణంగా వాయిదా వేసుకున్నారు. ఇక తాజాగా ఈనెల 14న బైక్‌ ట్రిప్‌ ప్రారంభించారు. అయితే ఆమె అనుకున్న కశ్మీర్‌ టూర్‌ కంటే ముందు మైసూర్‌కు ట్రయల్‌ రన్‌ కోసం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారు బైక్‌పై ప్రతి రోజు 250 నుంచి 300 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తున్నట్లు వారు వెల్లడించారు.

అయితే ఇలాంటి సంఘటనలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయని తల్లీ, కూతురు చెబుతున్నారు. ఇలా బైక్‌ ట్రిప్‌ చేయాలని కోరిక ఉండేదని,పెళ్లి రోజు సందర్భంగా తన భర్త బైక్‌ బహుమతిగా ఇవ్వడంతో సంతోషంగా కేరళ నుంచి కశ్మీర్‌కు బయలుదేరినట్లు చెప్పారు. అయితే బైక్‌పై వెళ్లే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఆరోగ్యాన్ని దృష్టిలో తమ ప్రయాణం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. అలాగే ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. అలాగే కరోనాను దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఇవీ కూడా చదవండి

Hyundai: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కార్లపై హ్యుందాయ్‌ కీలక నిర్ణయం..ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గింపు

Personal Loan Limit: ఆర్బీఐ కీలక నిర్ణయం.. వ్యక్తిగత రుణాల పరిమితిని పెంచుతూ ప్రకటన.. కానీ వారికి మాత్రమే..!