అధికారం చెరి సగమా ? నో ! నో !… ఫడ్నవీస్
మహారాష్ట్రలో అధికార పంపిణీకి సంబంధించి రోజురోజుకీ పరిణామాలు మారుతున్నాయి. 50 : 50 షేర్ ప్రకారం తమకు చెరి సగం పవర్ కావాలని శివసేన కోరుతుండగా..అలాంటి ప్రసక్తే ఉత్పన్నం కాదని బీజేపీ కొట్టి పడేస్తోంది.. అసలు రొటేషన్ ఫార్ములా అన్నదే ఏదీ లేదని బీజేపీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం కుండబద్దలు కొట్టారు. ‘ అయిదేళ్ల పాటు నేనే సీఎం.. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. చెరి సగం పవర్ పంపిణీ […]

మహారాష్ట్రలో అధికార పంపిణీకి సంబంధించి రోజురోజుకీ పరిణామాలు మారుతున్నాయి. 50 : 50 షేర్ ప్రకారం తమకు చెరి సగం పవర్ కావాలని శివసేన కోరుతుండగా..అలాంటి ప్రసక్తే ఉత్పన్నం కాదని బీజేపీ కొట్టి పడేస్తోంది.. అసలు రొటేషన్ ఫార్ములా అన్నదే ఏదీ లేదని బీజేపీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం కుండబద్దలు కొట్టారు. ‘ అయిదేళ్ల పాటు నేనే సీఎం.. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. చెరి సగం పవర్ పంపిణీ అంటూ శివసేన చేస్తున్న డిమాండుపై ప్రశ్నించినప్పుడు.. ఆయన.. ముఖ్యమంత్రి పదవిని రెండున్నర ఏళ్ళ పాటు రెండు పార్టీలూ పంచుకోవాలన్న ఫార్ములా ఏదీ లేదని చెప్పారు. ఇదే విషయాన్ని తమ పార్టీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా తనకు చెప్పారని ఫడ్నవీస్ తెలిపారు. అసలు ఈ విధమైన ప్రతిపాదన గురించి చర్చించలేదని షా చెప్పారు అని ఆయన వెల్లడించారు. ‘ ప్లాన్ బీ అవసరమే లేదు ‘ అన్నారు. ఇదిలా ఉండగా శివసేన మెల్లగా బలం పెంచుకుంటోంది. ఈ పార్టీకి తాజాగా మరో స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు. దీంతో సేన బలం 61 కి పెరిగింది. (ఇటీవలి ఎన్నికల్లో ఈ పార్టీ 56 స్థానాలను గెలుచుకుంది). తమ బలం పెరగడంతో … అధికార పంపిణీలో తమకూ చెరి సగం కావాలన్న సేన డిమాండ్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్న మొన్నటివరకు 15 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలలో నలుగురు సేనకు సపోర్ట్ ప్రకటించగా.. తాజాగా ఐదో వ్యక్తి.. శంకర రావు గడఖ్ అనే మరో ఎమ్మెల్యే కూడా తన మద్దతు ప్రకటించారు.
ఇక్కడ దుష్యంత్ చౌతాలా అంటూ ఎవరూ లేరు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్.. తాజాగా హర్యానా రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు. మహారాష్ట్ర రాజకీయాలకు, హర్యానా పాలిటిక్స్ కీ సంబంధం లేదన్నారు.’ ఇక్కడ దుష్యంత్ చౌతాలా లేరు.. ఆయన తండ్రి జైల్లో ఉన్నారు కదా ‘ అని సంజయ్ పేర్కొన్నారు. తాము ధర్మం, సత్యమనే రాజకీయాలను పాటిస్తామని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేక వాతావరణం సృష్టించిన శరద్ పవార్ పాటించే రాజకీయాలను తాము గౌరవిస్తామని ఆయన అన్నారు. బీజేపీ అనుసరించే విధానాన్ని దృష్టిలో ఉంచుకుని తాము త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అటు-బీజేపీ అధిష్టానం.. శివసేన నేత ఉధ్ధవ్ థాక్రే ని కలిసేందుకు యత్నిస్తోంది.



