Russia Ukraine Crisis: ఉక్రెయిన్ నుంచి 250 మందితో ఢిల్లీకి చేరుకున్న రెండో విమానం.. తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తోన్న విదేశాంగమంత్రి..
Russia Ukraine War: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల (Indians) తరలింపును విదేశాంగ శాఖ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 219 విద్యార్ధులతో తొలి ఎయిర్‌ఇండియా (Air India Flight) విమానం శనివారం రాత్రి ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే.
Russia Ukraine War: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల (Indians) తరలింపును విదేశాంగ శాఖ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 219 విద్యార్ధులతో తొలి ఎయిర్‌ఇండియా (Air India Flight) విమానం శనివారం రాత్రి ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రొమేనియా నుంచి 250 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిర్ ఇండియా రెండో విమానం దేశ రాజధాని ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులకు స్వాగతం పలికారు. కాగా ఉక్రెయిన్ (UKraine) నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను విదేశాంగశాఖ మంత్రి డాక్టర్ ఎస్. జై శంకర్ (S. Jaishankar) స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా ఉక్రెయిన్ పరిస్థితులపై ఎలాంటి కంగారు అవసరం లేదని రొమెనియాలో భారత రాయబారి రాహుల్ శ్రీవాత్సవ తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని సురక్షితంగా స్వదేశానికి తరలిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారతీయులను ఉక్రెయిన్ సరిహద్దులకు తరలించి అక్కడి నుంచి రొమేనియా రాజధాని బుఖారెస్ట్ మీదుగా భారతదేశానికి తీసుకొస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులందరూ ప్రభుత్వ అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లవద్దని భారత రాయబార కార్యాలయం కోరింది. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పరిస్థితి సున్నితంగా ఉందని, పౌరులను స్వదేశానికి తరలించేందుకు పొరుగుదేశాలతో భారతీయ రాయబార కార్యాలయం నిరంతరం టచ్‌లో ఉందని అధికారులు చెప్పారు. హంగేరీ, రొమేనియా, పోలాండ్‌లకు భారతీయ విద్యార్థులను తరలించి అక్కడి నుంచి న్యూఢిల్లీకి తీసుకువచ్చేందుకు పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎల్వివ్, ఇతర పట్టణాల్లో క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేశారు.
#OperationGanga continues.
The second flight from Bucharest has taken off for Delhi with 250 Indian nationals. pic.twitter.com/zml6OPNirN
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 26, 2022
Bayyaram Steel Plant: తెలంగాణలో మరో ఉద్యమం.. తగ్గేదే లే అంటున్న రాష్ట్ర సర్కార్..
Andhra Pradesh: తెలుగుదేశంలో కొత్త చర్చ.. ఆ శపథమే కారణం.. ఇంతకీ ఏం నిర్ణయం తీసుకుంటారో..!