Haj 2021: కరోనా కారణంగా ఈ ఏడాది హజ్ యాత్ర దరఖాస్తులన్నీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం

Haj 2021: కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం హజ్ యాత్రకు సౌదీ అరేబియా ప్రభుత్వం అంగీకరించలేదు. కరోనా ఇబ్బందుల నేపధ్యంలో కింగ్డమ్‌లో నివసిస్తున్న వారికి మాత్రమె అనుమతి ఇచ్చింది.

Haj 2021: కరోనా కారణంగా ఈ ఏడాది హజ్ యాత్ర దరఖాస్తులన్నీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం
Haj 2021
Follow us
KVD Varma

|

Updated on: Jun 15, 2021 | 9:48 PM

Haj 2021: కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం హజ్ యాత్రకు సౌదీ అరేబియా ప్రభుత్వం అంగీకరించలేదు. కరోనా ఇబ్బందుల నేపధ్యంలో కింగ్డమ్‌లో నివసిస్తున్న పరిమిత సంఖ్యలో ఉన్నవారికి మాత్రమే హజ్ నిర్వహించడానికి అనుమతి ఇస్తామని సౌదీ అరేబియా పేర్కొంది. దీంతో ఈ సంవత్సరం హజ్ యాత్ర రద్దు చేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంవత్సరం తీర్థయాత్రకు దరఖాస్తులన్నీ రద్దు చేసినట్లు భారత హజ్ కమిటీ మంగళవారం ప్రకటించింది.

కరోనావైరస్ మహమ్మారి పరిస్థితుల కారణంగా సౌదీ అరేబియా లోపల పౌరులు మరియు నివాసితులను మాత్రమే హజ్ కు హాజరుకావడానికి అనుమతించాలని నిర్ణయించినట్లు సౌదీ అరేబియా లోని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసిందని ఒక సర్క్యులర్లో కమిటీ తెలిపింది. స్తానికులతో అదీ, పరిమిత సంఖ్యలో సంవత్సరం హజ్ నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ హజ్ రద్దు చేశారు.

“అందువల్ల హజ్ -2021 స్టాండ్ల కోసం అన్ని దరఖాస్తులు రద్దు చేయాలని భారత హజ్ కమిటీ నిర్ణయించింది” అని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మక్సూద్ అహ్మద్ ఖాన్ సంతకం చేసిన సర్క్యులర్ లో పేర్కొన్నారు. కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో యాత్రికులను పంపవద్దని సౌదీ తెలియజేసిన తరువాత హజ్ 2020 కోసం భారతదేశం నుండి ముస్లింలు సౌదీకి వెళ్లవద్దని గత సంవత్సరం కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా భారతీయులకు హజ్ యాత్ర వెళ్ళే అవకాశం లేకుండా పోయింది.

ముస్లింలకు పరమ పవిత్రంగా భావించే యాత్ర హజ్. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని కోరుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ యాత్ర కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ముందుగా ఈ యాత్రకు వెళ్ళడానికి ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. హజ్ కమిటీ పర్యవేక్షణలో దరఖాస్తులు పరిశీలించి..హజ్ యాత్రకు అనుమతులు ఇస్తారు. హజ్ యాత్ర మొత్తం హజ్ కమిటీ పర్యవేక్షణలోనే జరుగుతుంది. పోయిన సంవత్సరం కూడా కరోనా కారణంగా హజ్ యాత్ర రద్దు చేశారు. ఈ సంవత్సరం హజ్ యాత్ర ఎలాగైనా నిర్వహించాలని భావించారు. అటు సౌదీ అరేబియా కూడా అన్ని అవకాశాలూ పరిశీలిస్తామని చెప్పింది. కానీ, కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇంకా అదుపులోకి రాకపోవడంతొ సౌదీ హజ్ యాత్రను కేవలం స్థానికులకు మాత్రమె పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపధ్యంలో భారతదేశంలో హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులన్నీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

Also Read: వ్యాక్సినేషన్ కి ఇక ‘కోవిన్’ పై ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు….కేంద్రం స్పష్టీకరణ

National Security Guard: బ్లాక్ క్యాట్ కమాండోలను (ఎన్‌ఎస్‌జీ) ఎలా ఎంపిక చేస్తారో తెలుసా?