Shocking: విపరీతమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. ఆపరేషన్ సమయంలో పొట్టలో ఉన్నది చూసి షాక్
కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఓ బాధితుడికి టెస్టులు చేసిన డాక్టర్లు స్టన్ అయ్యారు. వెంటనే అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Viral: ఓ వ్యక్తికి తట్టుకోలేనంత కడుపునొప్పి వచ్చింది. దీంతో హాస్పిటల్‌కి పరుగులు తీశాడు. కంటిన్యూగా నొప్పి వస్తుందని చెప్పడంతో.. అపెండిసైటిస్ ఏమో అనుకున్నారు వైద్యులు. వెంటనే టెస్టులు చేశారు. అయితే డాక్టర్ల అంచనాలు తలకిందులయ్యాయి. ఎక్స్‌రే రిపోర్ట్‌లో బాధితుడి కడుపులో పెద్ద వస్తువును గమనించారు. ఆ తర్వాత అది గ్లాస్ అని నిర్ధారించకున్నారు. ఆపై ఆపరేషన్ చేసి అతడి కడును నుంచి గ్లాసును సక్సెస్‌ఫుల్‌గా బయటకు తీశారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే..జౌన్‌పుర్( Jaunpur) జిల్లాలోని గోత్వా భటౌలీ విలేజ్‌లో సమరనాథ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివశిస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి అతడికి కడుపులో నొప్పి వస్తుంది. తొలుత చిన్నగా ప్రారంభమైన నొప్పి.. భరించలేని స్థాయికి వెళ్లింది. దీంతో దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి డాక్టర్ లాల్ బహదూర్.. టెస్టులు చేసి.. ఎక్స్‌రే తీసి పొట్టలో గ్లాసు ఉందని గుర్తించారు. ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య బృందంతో కలిసి గంట పాటు శస్త్ర చికిత్స చేసి.. కడుపులో నుంచి స్టీల్ గ్లాసును రిమూవ్ చేశారు.
डॉक्टर्स ने एक मरीज के पेट से ऑपरेशन करके स्टील का बड़ा गिलास निकालने का दावा किया है.
ये हैरान कर देने वाला मामला उत्तर प्रदेश के जौनपुर का है.
वीडियो ? pic.twitter.com/zznlmbPzZC
— Kumar Abhishek (TV9 Bharatvarsh) (@active_abhi) August 6, 2022
అయితే అతని పొట్టలోకి గ్లాస్ ఎలా వెళ్లింది అనే విషయం గురించి బాధితుడిని అడగ్గా నోటి ద్వారా వెళ్లిందని చెప్పాడు. రోగి భార్యను కూడా ప్రశ్నించారు. ఆమె నుంచి కూడా సరైన సమాధానం రాలేదు. తన భర్తకు హెర్నియా ఉందని.. మలమూత్ర విసర్జనకు సరిగ్గా వెళ్లట్లేదని.. అన్నం కూడా తినడం లేదని చెప్పింది. అయితే డాక్టర్ మాత్రం రోగి వెర్షన్ కొట్టిపారేశారు. అంత పెద్ద గ్లాస్ నోటి ద్వారా లోనికి వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేశారు. పక్కాగా మలద్వారం నుంచే అది కడుపులోకి వెళ్లి ఉంటుందని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి