AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambulance: ఐపీఎల్ క్రికెటర్ల కాన్వాయ్ కోసం అహ్మదాబాద్ లో అంబులెన్స్ నిలిపివేత..వీడియో వైరల్.. అదేమీ లేదంటున్న పోలీసులు

Ambulance Stopped For Cricketers: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) యొక్క 14 వ ఎడిషన్ చివరకు బయో బబుల్ లోపల ఆటగాళ్ళు, జట్టు సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో మంగళవారం నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Ambulance: ఐపీఎల్ క్రికెటర్ల కాన్వాయ్ కోసం అహ్మదాబాద్ లో అంబులెన్స్ నిలిపివేత..వీడియో వైరల్.. అదేమీ లేదంటున్న పోలీసులు
Ambulance Stopped For Cricketers
KVD Varma
|

Updated on: May 05, 2021 | 4:11 PM

Share

Ambulance: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) యొక్క 14 వ ఎడిషన్ చివరకు బయో బబుల్ లోపల ఆటగాళ్ళు, జట్టు సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో మంగళవారం నిలిపివేసిన సంగతి తెలిసిందే. కరోనా పెరిగిపోతున్న సందర్భంలో కొంతకాలంగా ఐపీఎల్ ఆపివేయాలనే డిమాండ్స్ వచ్చాయి. ఇప్పుడు అహ్మదాబాద్‌లో ఐపీఎల్ కాన్వాయ్ కోసం అంబులెన్స్ ఆగిపోతున్నట్టు కనిపిస్తున్న వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్ లలో టి 20 కోలాహలం పీక్స్ లో ఉంది. రెండు రాష్ట్రాలు కోవిడ్ -19 కేసులు గరిష్ట స్థాయిలో నమోదును చూస్తున్న ఐపీఎల్ నిలిపివేయడానికి బోర్డు సిద్ధం కాలేదు. మొత్తమ్మీద ఆటగాళ్ళకు.. జట్టు సిబ్బందికీ కరోనా సోకిన తరువాత కానీ నిరవధికంగా నిలిపి వేస్తున్నట్టు నిర్ణయం తీసుకోలేదు.

కరోనాతో మ్యాచ్ లు నిలిచిపోయిన తరువాత.. నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన తరువాత సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ కావడం మొదలు పెట్టింది. దీనిలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) బస్సు కనిపిస్తోంది. అదే సమయంలో ఓ అంబులెన్స్ అటువైపుగా వస్తోంది. కెకెఆర్ బస్సును పపడంకోసం పోలీసులు అంబులెన్స్ ఆపుతున్న దృశ్యం కనిపిస్తోంది. ఇక ఈ వీడియోపై జనం విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. నెట్టింట్లో ఈ వీడియో చూసినవారంతా పోలీసుల పనిని అసహ్యించుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఈ వీడియోపై అహమదా బాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ స్పందిచారు.. ఇది పోలీసుల ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం అని జాయింట్ పోలీస్ కమిషనర్ మయాంక్ సింగ్ చెప్పారు. నగరంలో ఇటువంటివి ఏమీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఏ విఐపి కాన్వాయ్ కోసం పోలీసులు అంబులెన్స్‌ను ఎప్పటికీ ఆపరని ఆయన పేర్కొన్నారు. కొంత గందరగోళం సృష్టించాలని చేశారని చెప్పారు. ఇది పోలీసులను కూడా దుర్భాషలాడే ప్రయత్నం కావచ్చని ఆయన అన్నారు.

ఆ వీడియో ఇదే..

 

“మేము వీడియోను చూశాము అలాగే, ఈ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ను ట్రాఫిక్ పోలీసులు లేదా అహ్మదాబాద్ పోలీసులు ఆపారా అని ఇంకా ధృవీకరించలేదు. ఏ విఐపి కాన్వాయ్ కోసం పోలీసులు అంబులెన్స్‌ను ఎప్పటికీ ఆపరు, అది ఐపిఎల్ ఆటగాళ్ళు లేదా ఏ మంత్రి అయినా. “వీడియో గందరగోళంగా ఉంది. స్పష్టత లేదు. నకిలీ అలాగే పరువు నష్టం కలిగించే వీడియోతో పోలీసుల ఇమేజ్‌ను దెబ్బతీసే దుర్మార్గపు ప్రయత్నం ఇది ”అని మీడియాతో మాట్లాడుతూ మాయన్‌సింగ్ అన్నారు. మరో సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ వీడియోలో అంబులెన్స్ ఎమర్జెన్సీలో ఉందా అని ఏ విధంగానూ చెప్పలేదు, ఎందుకంటే ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగించే సైరన్ ఆ సమయంలో మోగలేదు. అదీకాకుండా.. కాన్వాయ్ ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ జంక్షన్ వద్దకు మాత్రమే అంబులెన్స్ రావడం అలాగే, 5-6 సెకన్ల పాటు మాత్రమే వేచి ఉన్నట్టు కనిపిస్తోందని అన్నారు.

Also Read: Mamata Banerjee: ప్రమాణ స్వీకారం.. వెంటనే మమతా మార్క్.. కోవిడ్ నియంత్రణకు కఠిన మర్గదర్శకాలు..

Lockdown: కరోనా లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఢిల్లీ ప్రభుత్వం శుభవార్త!