AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra crime: భార్యతో చిన్నగా మొదలైన గొడవ.. చివరకు భర్త ఏం చేశాడో తెలిస్తే..

కుటుంబ కలహాలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో ఈ ఘటనే నిదర్శనం. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో కోపాన్ని ఆపుకోలేని భర్త అమానుషంగా ప్రవర్తించాడు. విచక్షణ కోల్పోయి భార్యపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Maharashtra crime: భార్యతో చిన్నగా మొదలైన గొడవ.. చివరకు భర్త ఏం చేశాడో తెలిస్తే..
Maharashtra Crime News
Vijay Saatha
| Edited By: |

Updated on: May 25, 2026 | 2:15 PM

Share

మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండీలో దారుణ ఘటన వెలుగుచూసింది. క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.  వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రాకు చెందిన సతీష్ అనే వ్యక్తి స్థానకంగా కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఇటీవల ఏదో విషయంలో సతీష్‌కు భార్యతో గొడవ మొదటైంది.. ఆ మాటల యుద్ధం కాస్తా పెరిగి పెద్దదైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సతీష్ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య తలను ఇంట్లో ఉన్న టీవీకేసి గట్టిగా కొట్టాడు. అంతే ఆమె తల పగిలి తీవ్ర రక్తస్రావం అయింది. క్షణాల్లోనే ఆమె కింద పడిపోయి ప్రాణాలు విడిచింది. ఇంట్లో నుంచి వస్తున్న కేకలు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.

రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోస్టుమార్టం కోసం దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం భార్యను దారుణంగా హతమార్చిన సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అన్ని రకాల ఆధారాలు సేకరిస్తున్నారు.

భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్ 103(1) కింద సతీష్ పై హత్య కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే అత్యంత కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. క్షణికావేశంలో చేసిన తప్పుకు ఇప్పుడు ఆ భర్త కటకటాల పాలు కావాల్సి వచ్చింది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

నిపుణుల సలహా

కుటుంబంలో చిన్నపాటి కలహాలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి. కానీ ఇలా భౌతిక దాడులకు దిగడం ఏమాత్రం సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. కోపం మనిషి ఆలోచనా శక్తిని ఎలా నాశనం చేస్తుందో ఈ ఉదంతం మరోసారి స్పష్టం చేస్తోందంటున్నారు. ఒక ప్రాణం గాలిలో కలిసిపోగా, మరో వ్యక్తి జీవితం జైలు పాలైంది. మిగిలిన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఇలాంటి ఘటనలు సమాజంలో పెరుగుతుండటం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య బంధం ఎంతో పవిత్రమైనది. అందులో ఇలాంటి దారుణమైన హింసకు అసలు చోటు ఉండకూడదు. కౌన్సెలింగ్ కేంద్రాలు, మానసిక నిపుణుల సలహాలు తీసుకోవడం ద్వారా ఇటువంటి అనర్ధాలను కొంతమేరకైనా అరికట్టవచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భార్యతో చిన్నగా మొదలైన గొడవ.. చివరకు భర్త ఏం చేశాడో తెలిస్తే..
భార్యతో చిన్నగా మొదలైన గొడవ.. చివరకు భర్త ఏం చేశాడో తెలిస్తే..
మీరు మార్కెట్‌లో కొన్న వంట నూనె అసలైనదేనా?
మీరు మార్కెట్‌లో కొన్న వంట నూనె అసలైనదేనా?
బలహీనత కాదు.. మగాళ్ల కంటే మహిళలే ఎందుకు ఎక్కువ ఏడుస్తారో తెలుసా
బలహీనత కాదు.. మగాళ్ల కంటే మహిళలే ఎందుకు ఎక్కువ ఏడుస్తారో తెలుసా
మజ్జిగతో మ్యాజిక్.. ఇలా చేస్తే కాగడ మల్లెలు గుత్తులుగా పూస్తాయ్
మజ్జిగతో మ్యాజిక్.. ఇలా చేస్తే కాగడ మల్లెలు గుత్తులుగా పూస్తాయ్
వేసవిలో పదేపదే స్నానం చేస్తున్నారా? జాగ్రత్త.. ఎంత డేంజరో తెలుసా
వేసవిలో పదేపదే స్నానం చేస్తున్నారా? జాగ్రత్త.. ఎంత డేంజరో తెలుసా
రామయ్య – రాబందు నీతి కథ.. చేసిన మేలు ఎప్పటికైనా తిరిగి వస్తుంది..
రామయ్య – రాబందు నీతి కథ.. చేసిన మేలు ఎప్పటికైనా తిరిగి వస్తుంది..
యావత్ సినీ ప్రియులను దిగ్భ్రాంతికి గురి చేసిన తారల మిస్టరీ మరణాలు
యావత్ సినీ ప్రియులను దిగ్భ్రాంతికి గురి చేసిన తారల మిస్టరీ మరణాలు
దమ్ముంటే కాస్కో.. ఈ ఫోటోలో ఉన్న 3 గుడ్లగూబలను గుర్తిస్తే.. మీరే
దమ్ముంటే కాస్కో.. ఈ ఫోటోలో ఉన్న 3 గుడ్లగూబలను గుర్తిస్తే.. మీరే
RCB vs GT Qualifier 1: ధర్మశాల పోరును డిసైడ్ చేసేది ఆ ఒక్కటే..?
RCB vs GT Qualifier 1: ధర్మశాల పోరును డిసైడ్ చేసేది ఆ ఒక్కటే..?
ఫ్రీ.. ఫ్రీ.. పైసా ఖర్చు లేకుండా పిల్లలతో కొడైకెనాల్ చుట్టేయోచ్చు
ఫ్రీ.. ఫ్రీ.. పైసా ఖర్చు లేకుండా పిల్లలతో కొడైకెనాల్ చుట్టేయోచ్చు