AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళ పాలిటిక్స్‏లో రీసౌండ్ చేస్తున్న ఆ హీరో.. నాకో లెక్కుంది అంటోన్న ఆ స్టార్ ఎవరో తెలుసా..

తమిళనాట సినీ ఇండస్ట్రీకి పాలిటిక్స్ బాగా కలిసి వచ్చాయి... కరుణానిధి, ఎంజీర్, జయలలిత, విజయ్ కాంత్.. తర్వాత రజనీకాంత్ పొలిటిల్ ఎంట్రీ విషయంలో అభిమానులు నిరుత్సాహపడ్డారు..

తమిళ పాలిటిక్స్‏లో రీసౌండ్ చేస్తున్న ఆ హీరో.. నాకో లెక్కుంది అంటోన్న ఆ స్టార్ ఎవరో తెలుసా..
Politics
Rajitha Chanti
|

Updated on: Feb 09, 2022 | 6:10 PM

Share

తమిళనాట సినీ ఇండస్ట్రీకి పాలిటిక్స్ బాగా కలిసి వచ్చాయి… కరుణానిధి, ఎంజీర్, జయలలిత, విజయ్ కాంత్.. తర్వాత రజనీకాంత్ పొలిటిల్ ఎంట్రీ విషయంలో అభిమానులు నిరుత్సాహపడ్డారు.. కమల్ ఎంట్రీ ఇచ్చినా కనీసం ఇంపాక్ట్ చూపలేక పోయారు.. ఇక పోలిటికల్ గా తన స్టామినా చూపేందుకు నటుడు విజయ్ ప్రయత్నాల్లో ఉన్నారా.. లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూస్తే అదే అనిపిస్తోందట.  తమిళనాడు రాజకీయాలను.. సినీ పరిశ్రమను విడదీసి చూడలేం.. కరుణానిధి, నుంచి నిన్నటి కరుణానిధి వరకు పొలిటికల్ గా సినీ ఇండస్ర్తి జాబితా చాలానే ఉంది.. అయితే తమిళ పాలిటిక్స్ లో ఇపుడు మరో పేరు రీసౌండ్ చేస్తోంది.. దళపతి విజయ్.. రజనీ పొలిటికల్ ఎంట్రీ లేదని క్లారిటీ వచ్చేసింది.. ఇక విజయ్ (Vijay Thalapathy) మాటేమిటి… సార్వత్రిక ఎన్నికల సీజన్ కాని వేళ ఎందుకింత చర్చ.. నాకో లెక్కుంది.. ఆ లెక్కకున్న లక్కేంటో చూపిస్తా అంటున్నారు దళపతి విజయ్..

బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్.. ఇలా ఎక్కడా లేని విధంగా కోలీవుడ్ లో సినీ నటుల పట్ల ఉన్న అభిమానం ఇక్కడ సొంతం.. నచ్చితే గుడులు కట్టేసేంత అభిమానం ఇక్కడి ప్రజలది.. అందుకే రాజకీయాల్లో సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వారికి పొలిటికల్ సక్సెస్ ఆ రేంజ్ లో దక్కింది.. కరుణానిధి, ఎంజీర్, జయలలిత దశాబ్దాల పాటు తమిళ పాలిటిక్స్ లో చక్రం తిప్పారు.. అయితే ఇప్పుడు ఆ లెజెండ్స్ లేరు.. డీఎంకే నుంచి కరుణానిధి వారసుడిగా స్టాలిన్ స్థానాన్ని దక్కించుకున్నారు.. అన్నాడీఎంకే లో పరిస్థితి తలో దిక్కు అన్న చందంగా ఉంది.. ఇక ప్రముఖ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పేరుతో పార్టీ స్థాపించినా ఇంపాక్ట్ చూపలేకపోయారు.ఎం ఈ పరిస్థితుల్లో తమిళనాట పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది.. అది ఎవరు భర్తీ చేస్తారు.. నిన్నటి దాకా రజనీకాంత్ ఊరించి ఉసూరుమనిపించారు.. అయితే తమిళనాట ఫ్యూచర్ పొలిటికల్ స్టార్ గా వినిపిస్తున్న పేరు దళపతి విజయ్… రజనీ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్న నటుడు విజయ్… విజయ్ పేరుతో ఓ సేవా సంఘం ఉంది.. అదే విజయ్ మక్కల్ ఇయక్కమ్.. ఇటీవల తమిళనాట జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 170 స్థానాల్లో మక్కల్ ఇయక్కమ్ తరపున అభిమానులు పోటీ చేస్తే 120 మంది విజయం సాధించారు..

పంచాయతీ ఎన్నికల వేదికగా అనేక వివాదాలు..

పంచాయతీ ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కమ్ తరపున అభ్యర్థులు పోటీ పై వివాదం నెలకొంది.. తన అభిమానులు ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. అలా చేస్తే నాకు సంబంధం విజయ్ నేరుగా ప్రకటించారు.. ఇదే విషయంపై విజయ్ తండ్రి, నిర్మాత చంద్రశేఖర్ విరుద్ధమైన ప్రకటన చేశారు.. పోటీ చేసే అభ్యర్థులు అందరూ మక్కల్ ఇయక్కమ్ పేరుతోనే పోటీ చేస్తున్నారని ప్రకటించారు.. ఈ విషయంపై అప్పట్లో, విజయ్.. తండ్రి చంద్ర శేఖర్ ల మధ్య యుద్ధమే నడిచింది.. విజయ్ తన తండ్రి చర్యలపై పోలీసులకు పిర్యాదు దాకా వెళ్ళింది.. విజయ్ తల్లి కూడా మీడియాకు తండ్రి కొడుకుల మధ్య విభేదాలు ఉన్నాయని చేసిన కామెంట్స్ కూడా సంచలనం.. ఆతర్వాత ఎన్నికల్లో 170 మంది అభ్యర్థులు.. అంటే టెక్నీకల్ గా వీరు ఇండిపెండెంట్.. అయితే విజయ్ మక్కల్ ఇయక్కమ్ మద్దతు ఉన్న అభ్యర్థులు.. ఇందులో 120 మంది వరకు విజయం సాధించారు.. కమల్ హాసన్ పార్టీ ఎం.ఎన్. ఎం, నామ్ తమిలన్ కట్చి కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయని విజయ్ అభిమానులు ప్రకటించారు.. అన్ని వివాదాల తర్వాత విజయ్ విజయం సాధించిన అభిమానులతో కలిసి ఫోటోలు దిగడం.. అభినందించడం చర్చకు దారి తీసింది.. ఇప్పుడు తాజాగా జరుగుతున్న కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో విజయ్ తమ సంఘం తరపు నుంచి అభ్యర్థులు బరిలో ఉంటారని ప్రకటించారు.. అయితే మక్కల్ ఇయక్కమ్ తరపున పోటీ విషయంలో తండ్రి కొడుకుల మధ్య ఆస్థాయి గ్యాప్ ఎందుకు అనేది ఇప్పటికీ ఓ ఫజిల్..

అయితే అందులో విజయ్ స్టాటజీ ఉందని కూడా చెబుతారు.. పొలిటికల్ గా ఇప్పటికప్పుడు సక్సెస్ కాలేకపోతే తన సినీ కెరీర్ పై ప్రభావం ఉండకూడదు అనేది తన క్యాలుకులేషన్.. అంతా ఒకే అనుకున్నాక.. రావాల్సిన సందర్భం వచ్చాక అడుగు ముందుకు వేయలనేది విజయ్ ఆలోచన కావచ్చని తన సన్నిహితుల మాట.

Vijay

Vijay

ఎడిఎంకే, బిజెపి ఓటు బ్యాంకు పై ఎఫెక్ట్..

గతంలో ఎడిఎంకే ప్రభుత్వం బిజెపి కి కేంద్రంలో మద్దతుగా ఉండేది.. ఆ సమయంలో విజయ్ తన సినిమాల్లో టచ్ చేసిన అంశాలు వివాదాస్పదమయ్యాయి.. అప్పట్లో విజయ్ ఇంటిపై వరుస ఐటి సోదాలు జరిగాయి.. బిజెపి టార్గెట్ గా విజయ్ మూమెంట్స్ ఎప్పటికప్పుడు తమిళనాట హైలెట్ అవుతుంటాయి.. మొన్నీమధ్య తమిళనాడు ఎసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు విజయ్ సైకిల్ పై వచ్జి పెరుగుతున్న పెట్రోల్ ధరల పై నిరసన తెలిపిన తీరు హాట్ టాపిక్ గా మారింది.. ఇపుడు ఈ అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో విజయ్ అభిమానుల పోటీ కూడా ఈ రెండు పార్టీల ఓటు బ్యాంకు పై ప్రభావం చూపే అవకాశం ఉంది..

అప్పుడు కాదని ఇప్పుడెందుకు..

ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో పోటీ వద్దన్న నటుడు విజయ్ ఇప్పుడెందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేదే చర్చ.. అందుకు కారణం ఉంది.. ఎప్పటికైనా పాలిటిక్స్ లోకి రావాలనేది విజయ్ ఆలోచన.. పొలిటికల్ లెజెండ్స్ గా ఉన్న కరుణానిధి , జయలలిత లేరు.. రాజకీయాల్లోకి వస్తారని భావిస్తున్న రజనీకాంత్ రాలేదు..రాడని తేలిపోయింది.. ఇక పొలిటికల్ గా స్టాలిన్ తప్ప ఆ స్థాయి రాజకీయ నేతలూ తమిళనాట లేరు.. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలంటే అసలు ప్రజల్లో మన సత్తా ఎంత.. అది తెలుసుకోవడం కోసమే ఈ ప్రయత్నం అనేది విశ్లేషకుల మాట.. పార్టీ గుర్తు లేక పోయినా టెక్నీకల్ గా ఇండిపెండెంట్ గానే అభ్యర్థులు బరిలో ఉంటారు.. విజయ్ మద్దతు, అభిమానుల కృషి ఫలించి అనుకున్న స్థానాలు వస్తే.. ఈ ఎన్నికలను కర్టన్ రైజర్ గా భావించి నెక్స్ట్ స్టెప్ వేసేందుకు ఇదో ట్రైల్ లాంటిది.

బైలైన్.. Murali, Nellore dist, TV9 Telugu

Also Read: Kajal Aggarwal: మీరు బ్రతకండి.. ఇతరులను బ్రతకనివ్వండి.. బాడీ షేమింగ్ చేసినవారికి కాజల్ స్ట్రాంగ్ ఆన్సర్..

Isha Chawla: ప్రేమకావాలి అంటూ ఒకసారి ఎంట్రీ.. డబల్ ధమాకాతో రీఎంట్రీ..’ఇషాచావ్లా’ న్యూ ఫొటోస్..

Meenakshi Chaudhary: అలాంటి సీన్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్న బ్యూటీ..

Hijab Row: చదువుకునే విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.. హిజాబ్‌ వివాదం పై స్పందించిన కమల్