దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల(UP Election) మొదటి దశ పోలింగ్(Uttar Pradesh first phase polling) గురువారం జరగబోతోంది. ఫిబ్రవరి 10న ఉత్తరప్రదేశ్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఉండగా.. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి దశలోని 58 స్థానాల్లో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు కూడా పూర్తి చేసింది. దీంతో పాటు ఓ రకంగా అభ్యర్థుల హవా పెరిగిపోగా, ఓటర్లు మాత్రం ఎన్నికలకు సంబంధించి దాదాపు మూడ్‌ను సిద్ధం చేసుకున్నారు. మొదటి విడతలో 58 నియోజకవర్గాల్లో 2.17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 58 అసెంబ్లీ స్థానాల కోసం 500 మందికి పైగా వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో విడత పోలింగ్ ఈ నెల 14వ తేదీన జరగబోతోంది. మొదటి దశ పోలింగ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాజా సామాచారాన్ని మీ ముందు ఉంచుంతుంది టీవీ9 తెలుగు డిజిటల్. టీవీ9 వెబ్ సైట్లో ప్రత్యేకంగా లైవ్ ఉంటుంది.
వారేని ఓట్లు వరిస్తాయి..
వివాదాస్పద ప్రకటనలు, వలసలు, రైతులు, కులం, మతం అనే ఐదు చక్రవ్యూహాలను దాటుకుని ఓట్లను తమవైపు తిప్పుకునే పార్టీనే ఉత్తర ప్రదేశ్‌లో అధికారం దక్కించుకుంటుంది. ముఖ్యంగా ఈ ఐదు అంశాలే యూపీలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు అక్కడి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వీరి మధ్య అసలు పోటీ..
పశ్చిమ యుపీలోని 11 జిల్లాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అయితే మొదటి దశలో ఈ మొత్తం 15 సీట్లలో మాత్రమే కొద్ది ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో దేశం మొత్తం చూపు ఈ సీట్లపైనే ఉంది.
భారతీయ జనతా పార్టీ 2017లో తిరుగులేని విజయం
భారతీయ జనతా పార్టీ 2017లో తిరుగులేని విజయం దక్కించుకుని కనీవినీ ఎరుగని మెజారిటీతో.. మొత్తం 408 స్థానాల్లో 312 సీట్లను కైవసం చేసుకుని అధికారం దక్కించుకుంది. ఇప్పుడు కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది బీజేపీ. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఘనవిజయం సాధించింది. తొలి దశలో 58 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీజేపీ 53 స్థానాల్లో విజయం సాధించింది. మోడీ వేవ్ పూర్తి ప్రయోజనం బీజేపీకి దక్కింది.
బీజేపీకి ఉత్తరప్రదేశ్ చాలా ముఖ్యమైన స్థానం.. ఎందుకంటే, యూపీలో గెలవకపోతే 2024లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎదురుగాలి వీచే అవకాశం ఉంది. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ దేశరాజకీయాల్లో కూడా కీలకంగా ఉంటుంది.
అదే సమయంలో మొదటి దశలో ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాలి. ఇక్కడ జరిగిన పోలింగ్ తీరు మిగిలిన దశలపై కూడా ఉంటుంది.
ఇవి కూడా చదవండి: Tukkuguda: అధికార టీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలోకి చేరిన తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్
UP Elections: ఎస్పీలో అఖిలేష్ యాదవ్ మేనమామ శివపాల్‌కు అవమానం! బీజేపీలో చేరిన పీఎస్పీ నేతలు..