AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్మూ కాశ్మీర్ నుంచి 10 వేల పారా మిలిటరీ దళాల ఉపసంహరణ

జమ్మూ కాశ్మీర్ నుంచి 10 వేల పారామిలిటరీ దళాలను తక్షణమే  ఉపసంహరించాలని కేంద్రం నిర్ణయించింది. గత ఏడాది ఆగస్టులో ఈ బలగాలను అక్కడ మోహరించారు. 370 అధికరణాన్నిరద్దు చేసి..

జమ్మూ కాశ్మీర్ నుంచి 10 వేల పారా మిలిటరీ దళాల ఉపసంహరణ
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 19, 2020 | 7:50 PM

Share

జమ్మూ కాశ్మీర్ నుంచి 10 వేల పారామిలిటరీ దళాలను తక్షణమే  ఉపసంహరించాలని కేంద్రం నిర్ణయించింది. గత ఏడాది ఆగస్టులో ఈ బలగాలను అక్కడ మోహరించారు. 370 అధికరణాన్నిరద్దు చేసి, జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత ముందు జాగ్రత్త చర్యగా ఈ బలగాలను నియోగించారు. అయితే ఈ బలగాల స్థానే..సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ను నియమించిన అనంతరం ఈ బలగాలను వెనక్కి పంపాలని హోమ్ శాఖ నిర్ణయించింది. మొత్తం 100 కంపెనీల్లో 40 సీఆర్ఫీ ఎఫ్ నుంచి, సీఐఎస్ ఎఫ్, బీ ఎస్ ఎఫ్, సహస్ర సీమా బల్ దళాల నుంచి 20 కంపెనీల చొప్పున బలగాలు ఉన్నాయి.