వచ్చే ఏడాది కల్లా ‘మేడ్ ఇన్ ఇండియా’ ఐఫోన్
అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో ఐఫోన్-12 స్మార్ట్‌ఫోన్ల తయారీని ప్రారంభించడానికి సన్నాహాలు ప్రారంభిస్తోంది.

దేశంలో కేంద్ర ప్రభుత్వ పిలుపుతో విదేశీ కంపెనీలు భారత్ బాటపట్టాయి. నాణ్యమైన వస్తువుల అడ్డాగా భారత్. ఆత్మనిర్భర భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అత్మనిర్భర భారత్ పేరుతో విదేశీ కంపెనీలు ఇండియాలో ఉత్పత్తులు ప్రారంభిస్తున్నాయి. అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో ఐఫోన్-12 స్మార్ట్‌ఫోన్ల తయారీని ప్రారంభించడానికి సన్నాహాలు ప్రారంభిస్తోంది. యాపిల్ సప్లైయర్ విస్ట్రాన్ బెంగళూరుకు సమీపంలోని నరసాపుర ప్లాంట్లో ఈ మొబైల్ ఫోన్లను తయారు చేయడానికి సిద్ధమైంది. మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్-12 మోడల్ ఫోన్లను వచ్చే ఏడాదిలో విడుదల చేయాలని యాపిల్ సంస్థ భావిస్తోంది. వచ్చే ఏడాది మధ్యలో ఫోన్ల ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. తమిళనాడులోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఐఫోన్ 11 తయారీని యాపిల్ సంస్థ ఇప్పటికే ప్రారంభించింది. తాజా ఐఫోన్ ఎస్‌ఈ(2020) ఫోన్ల దేశీయ ఉత్పత్తి ఈ ఏడాది చివరికల్లా ప్రారంభమవుతుందని కంపెనీ భావిస్తున్నది. కాగా, వచ్చే ఏడాదిలో పూర్తి ఇండియా మేడ్ యాపిల్ ఫోన్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.




