Tamil Nadu: కడలూరు జిల్లాలో హైటెన్షన్.. ఉత్సవాల నిర్వహణపై గొడవ.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ
వరదరాజ పెరుమాళ్ ఆలయ కుంభాభిషేకం ఏర్పాట్లను సజావుగానే ప్రారంభించినప్పటికీ, ఓ చిన్న విషయంలో గ్రామస్థుల మధ్య గొడవ జరిగింది.
Varadaraja perumal temple: తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఒక్కసారిగా హైటెన్షన్ క్రియేటైంది. గుడిలో జరిగే ఉత్సవాల విషయంలో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కడలూరు (kadalur) జిల్లాలోని సేవారు గ్రామం వరదరాజ పెరుమాళ్ టెంపుల్‌లో ఈ ఘటన జరిగింది. వరదరాజ పెరుమాళ్ ఆలయ కుంభాభిషేకం ఏర్పాట్లను సజావుగానే ప్రారంభించినప్పటికీ, ఓ చిన్న విషయంలో గ్రామస్థుల మధ్య గొడవ జరిగింది. ఆలయంలోకి ఒక వర్గం వారిని రానివ్వడం లేదని, నిషేధం విధిస్తున్నారని, ఆలయ పనులు చేయనివ్వడం లేదని మరో వర్గం అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారులొచ్చి విచారణ జరుపుతుండగానే, ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు.
ఈ ఘర్షణలో గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. వెంటనే ఆలయ ఉత్సవాలను నిలిపివేశారు. ఉత్సవాల నిలిపివేతపైనా ఇరు వర్గాల మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. దీంతో ఆ గ్రామంలో భారీగా మోహరించారు పోలీసులు. గొడవకు దిగిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..