PM Modi: అదే భారత్ గర్వకారణం.. ప్రధాని నోట సిరిసిల్ల నేతన్న మాట.. ‘మన్‌ కీ బాత్‌’‌లో హరిప్రసాద్‌పై మోడీ ప్రశంసలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోట సిరిసిల్ల నేతన్నల మాట విన్పించింది. ఆదివారం జరిగిన మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో సిరిసిల్ల చేనేత కార్మికుడు యెల్ది హరిప్రసాద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

PM Modi: అదే భారత్ గర్వకారణం.. ప్రధాని నోట సిరిసిల్ల నేతన్న మాట.. ‘మన్‌ కీ బాత్‌’‌లో హరిప్రసాద్‌పై మోడీ ప్రశంసలు..
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 27, 2022 | 12:52 PM

PM Modi – Mann Ki Baat: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోట సిరిసిల్ల నేతన్నల మాట విన్పించింది. ఆదివారం జరిగిన మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో సిరిసిల్ల చేనేత కార్మికుడు యెల్ది హరిప్రసాద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. జీ-20 సమావేశాలకు హరిప్రసాద్‌ తన చేతితో స్వయంగా నేసిన లోగోను మోడీ చూపించారు. ఈ అద్భుతమైన బహుమతిని చూసి నేను ఆశ్చర్యపోయానని.. చేనేత కార్మికుల గొప్పదనాన్ని, కళా నైపుణ్యాన్ని వివరిస్తూ ప్రధాని మోదీ అభినందించారు. జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌ చేపట్టడం గర్వకారణంగా ఉందని మోడీ తెలిపారు. డ్రోన్‌ టెక్నాలజీలో భారత్‌ దూసుకెళ్తోందని మోడీ వివరించారు. వన్‌ ధర్మ్‌ , వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌.. ఇది G-20 కూటమి సందేశం కావాలన్నారు. విక్రమ్ -ఎస్‌ రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌ కావడం భారత్‌కు గర్వకారణమని మోడీ తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పలు విషయాలపై సమగ్రంగా ప్రసంగించారు. 2023లో G20 సదస్సుకు భారతదేశం అధ్యక్షత వహించబోతోంది. ఈ నేపథ్యంలో మన్ కీ బాత్ 95వ ఎపిసోడ్లో దాని గురించి ప్రత్యేకంగా ప్రసంగించారు.

కొన్ని రోజుల క్రితం నేను జి-20 లోగోను, ప్రెసిడెన్సీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ను ఆవిష్కరించే అవకాశాన్ని పొందానంటూ ప్రధాని పేర్కొన్నారు. హరిప్రసాద్ పంపిన ఈ బహుమతి అందుకోగానే తన మనసులో మరో ఆలోచన వచ్చిందని తెలిపారు. తెలంగాణలోని ఒక జిల్లాలో కూర్చున్న వ్యక్తి కూడా జి-20 వంటి శిఖరాగ్ర సదస్సుతో ఎంతగా అనుసంధానమయ్యాడో చూసి తాను చాలా సంతోషించానన్నారు. ఇంత పెద్ద సమ్మిట్‌ని దేశం నిర్వహించడం వల్ల హృదయం ఉప్పొంగిపోయిందని హరిప్రసాద్‌ లాంటి చాలా మంది తనకు లేఖలు పంపారని మోడీ పేర్కొన్నారు.

అదేవిధంగా పూణే నుంచి సుబ్బారావు చిల్లారా, కోల్‌కతా నుంచి తుషార్ జగ్‌మోహన్‌ గారు పంపిన సందేశాలను కూడా ప్రస్తావించారు. జీ20 ప్రెసిడెన్సీ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవడం ద్వారా గ్లోబల్ గుడ్, ప్రపంచ సంక్షేమంపై దృష్టి పెట్టాలని మోడీ పేర్కొన్నారు. శాంతి లేదా ఐక్యత, పర్యావరణం పట్ల సున్నితత్వం, స్థిరమైన అభివృద్ధికి సంబంధించిన సవాళ్లకు భారతదేశం పరిష్కారాలను కలిగి ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

G20కి వచ్చే వ్యక్తులు ఇప్పుడు డెలిగేట్‌లుగా రావచ్చని.. కానీ భవిష్యత్తులో పర్యాటకులు కూడా వస్తారని తెలిపారు. నవంబర్ 18న దేశం మొత్తం అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర సృష్టించడాన్ని చూసిందతీ.. భారత్ మొదటి ప్రైవేట్ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపిందని మోడీ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..