పులికాట్ వివాదం..! నిర్భంధంలో 12 మంది జాలర్లు..!
పులికాట్ సరస్సులో చిచ్చు రేగింది. తమ రాష్ట్ర సరిహద్దులోకి వచ్చి చేపలు పడుతున్నారంటూ కోస్తాంధ్ర జాలర్లను తమిళనాడు జాలర్లు నిర్భంధించారు. రెండు రాష్ట్రాల్లో విస్తరించివున్న పులికాట్ సరస్సులో నీరున్న కొన్ని ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల జాలర్లు పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా తమ రాష్ట్ర సరిహద్దులోకి కోస్తాంధ్ర జాలర్లు వచ్చారంటూ వారిని నిర్భంధించారు. పులికాట్ సరస్సులో ఏపీ, తమిళనాడు జాలర్ల మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాకు చెందిన 12 మంది జాలర్లను నిర్భంధించి వారి […]

పులికాట్ సరస్సులో చిచ్చు రేగింది. తమ రాష్ట్ర సరిహద్దులోకి వచ్చి చేపలు పడుతున్నారంటూ కోస్తాంధ్ర జాలర్లను తమిళనాడు జాలర్లు నిర్భంధించారు. రెండు రాష్ట్రాల్లో విస్తరించివున్న పులికాట్ సరస్సులో నీరున్న కొన్ని ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల జాలర్లు పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా తమ రాష్ట్ర సరిహద్దులోకి కోస్తాంధ్ర జాలర్లు వచ్చారంటూ వారిని నిర్భంధించారు. పులికాట్ సరస్సులో ఏపీ, తమిళనాడు జాలర్ల మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాకు చెందిన 12 మంది జాలర్లను నిర్భంధించి వారి దగ్గరున్న వలలు, పడవులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఏపీ జాలర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.



