TN Politics: తమిళనాట రచ్చ రేపుతున్న ఆ ఒక్కమాట.. డీఎంకేకి ప్లస్‌గా మారుతోందా?
ప్రాంతీయవాదాన్ని బలంగా వినిపించడంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమిళనాడు ప్రభుత్వం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అది భాషాపరమైన అంశమైన సాంప్రదాయాలైనా.. కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో అది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చని అంశమైతే అందుకోసం ఎంత దూరమైనా పోరాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గతంలో జల్లికట్టు విషయంలో సుప్రీంకోర్టు నిషేధం ఉన్న యావత్ తమిళనాడు ప్రజలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేసి...

అక్కడ ఉద్యమం జరిగితే అంతిమ విజయం వారిదే అయి ఉండాలి.. ఇప్పటిదాకా తమిళనాడు రాష్ట్రంలో ఏ ఉద్యమమయినా అదే జరిగింది.. తాజాగా మరో ఉద్యమం తప్పదా అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి. డిఎంకె, బిజెపి.. రెండు పార్టీలు డీ అంటే ఢీ అంటుండగా..తమిళనాడు లోని మిగిలిన పార్టీలకు కూడా డిఎంకె కు వంత పాడక తప్పడంలేదు. అసలే భాష పై మాటల యుద్ధం జరుగుతుంటే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట తేనె తుట్టెను కడిపినట్లయింది. తమిళనాడులో రీసెంట్ గా రచ్చ రేపుతున్న అంశం హిందీ అమలు.. ఖచ్చితంగా హిందీ అమలు జరగాల్సిందేనని అంటోంది కేంద్రం.. అందుకు చాన్సే లేదు.. హిందీ భాషను అమలు చేసేదే లేదంటూ కరాకండిగా చెబుతోంది తమిళనాడులోని డిఎంకె సర్కార్.. అలాగే డిఎంకె హిందీకి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి దశాబ్దాల క్రితం బలమైన పునాదులు వేసుకుంది ఈ హిందీ వ్యతిరేక ఉద్యమం ద్వారానే.. రాజకీయంగా తమిళ గడ్డపై సత్తా చాటాలన్న ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ ఇపుడు ఇదే అంశం వేదికగా రెండు పార్టీల మధ్య పొలిటికల్ యుద్ధం జరుగుతోంది.
ప్రాంతీయవాదాన్ని బలంగా వినిపించడంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమిళనాడు ప్రభుత్వం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అది భాషాపరమైన అంశమైన సాంప్రదాయాలైనా.. కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో అది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చని అంశమైతే అందుకోసం ఎంత దూరమైనా పోరాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గతంలో జల్లికట్టు విషయంలో సుప్రీంకోర్టు నిషేధం ఉన్న యావత్ తమిళనాడు ప్రజలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి అనుమతినిచ్చేదాకా పోరాటం కొనసాగింది. అలాంటిది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని లెక్కచేయకుండా మాపై బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తే మేము ఊరుకోమని అన్ని ప్రభుత్వాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. తాజాగా మరోసారి తమిళనాడు లో హిందీ అమలు అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం పీక్స్ కు చేరుకున్న విషయం చూస్తూనే ఉన్నాం.. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలైంది. 1968 లో అన్నా దురై ఈ ఆదేశాలను వ్యతిరేకించారు. ద్రవిడ కళగం అనే పార్టీ నుంచి విడిపోయి ద్రవిడ మున్నేట్ర కలగంగా ఏర్పడ్డ డిఎంకె అప్పటినుంచి హిందీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉంది.
1968లో డిఎంకె మాత్రం హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని పీక్స్ కు తీసుకెళ్లింది… ద్రవిడ పార్టీలన్ని కూడా అప్పట్లో డిఎంకె కు మద్దతుగా నిలవాల్సిన పరిస్థితి.. అయితే ఇటీవల హిందీ అమలు అంశం అనేది అప్పుడప్పుడు తప్ప పెద్దగా ఎక్కడా చర్చకు రాలేదు.. అలాంటిది సైలెంట్ గా ఉన్న ఈ అంశాన్ని బిజెపి తేనె తుట్టెను కదిపినట్లు రచ్చకు కారణమైందన్న వాదన వినిపిస్తోంది. ఆ పోరాటం డిఎంకె ఆవిర్భవించిన సందర్భంలో పార్టీకి అధికారాన్ని తెచ్చి పెట్టింది. తమిళనాడులో హిందీ ఉద్యమానికి ఉన్న బలం ఏంటి అనేది ఈ ఒక్క ఉదాహరణ మాత్రం చాలు.
హిందీ అమలుపై గత నెల రోజుల నుంచి జరుగుతున్న ఇంత రాద్ధాంతం చాలదు అన్నట్లు పార్లమెంట్ లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచింది. భాష అమలుపై డిఎంకె ఎంపీలు అనాగరికంగా వ్యవహరిస్తున్నారు అన్న వ్యాఖ్యలు తమిళనాట మంటలు రేపుతోంది. ఇది అచ్చం డిఎంకె, బిజెపి మధ్య యుద్ధమే అయినా.. తమిళ సెంటిమెంట్ అంశంగా జరుగుతున్న ఈ వివాదంలో సైలెంట్ గా ఉంటే తమకు నష్టం జరగడంతో పాటు డిఎంకెకు పూర్తిగా ప్లస్ గా మారుతుంది అన్న కారణంతో తమిళనాడులోని మిగిలిన ద్రవిడ పార్టీలన్నీ డీఎంకేకు మద్దతుగా నిలవాల్సిన పరిస్థితి.. ఇటీవల పార్టీని స్థాపించి డిఎంకే ని పదేపదే వ్యతిరేకిస్తున్న నటుడు విజయ్ పార్టీ సహా తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం డిఎంకే చిరకాల ప్రత్యర్థి అయిన అన్నా డిఎంకె కూడా డిఎంకె వాదనను బలపరుస్తోంది. తమిళులపై ఉచిత వ్యాఖ్యలు చేశారంటూ పార్లమెంటులో మోషన్ కూడా డిఎంకె దాఖలు చేయడంతో తమిళనాడు మొత్తం ఇపుడు ఇదే అంశంపై బిజెపికి వ్యతిరేకంగా కౌంటర్ ఇస్తుంటే బిజెపి మాత్రం ఇప్పటికి తన వ్యాఖ్యలను వెనక తీసుకునే ప్రయత్నం చేయకపోవడం.. ఈ వివాదం ఎక్కడదాకా వెళుతుంది అన్నది చూడాల్సిందే..