సోషల్ మీడియాలో డబ్బున్న యువకులే లక్ష్యంగా వల.. ఏకంగా 8 మందిని పెళ్లాడింది!

ఓ మాయ లేడీ డబ్బున్న యువకులను వలలో వేసుకుని ఏమార్చి వరుసగా పెళ్లిళ్లు చేసుకుంది. ఇలా ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఎనిమిది మందిని పెళ్లాడింది. తొలుత ధనవంతులైన యువకులతో సోషల్‌ మీడియాలో ప్రేమ వ్యవహారం నడిపి..

సోషల్ మీడియాలో డబ్బున్న యువకులే లక్ష్యంగా వల.. ఏకంగా 8 మందిని పెళ్లాడింది!
Risheeda
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 12, 2023 | 8:15 AM

అమరావతి: ఓ మాయ లేడీ డబ్బున్న యువకులను వలలో వేసుకుని ఏమార్చి వరుసగా పెళ్లిళ్లు చేసుకుంది. ఇలా ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఎనిమిది మందిని పెళ్లాడింది. తొలుత ధనవంతులైన యువకులతో సోషల్‌ మీడియాలో ప్రేమ వ్యవహారం నడిపి ఆ తర్వాత వివాహం చేసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లోని బంగారు నగలు, డబ్బుతో ఉడాయించేంది. ఈ నిత్య పెళ్లికూతురి వ్యవహారం తాజాగా బయటపడటంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తమిళనాడులోని సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్‌ మూర్తికి రషీద అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఈ ఏడాది మార్చి 30న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఐతే వివాహమైన కొన్ని రోజులకే దంపతుల మధ్య మనస్పర్ధలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో జులై 4న ఇంట్లో ఉన్న రూ.1.5 లక్షల డబ్బు, 5 సవర్ల బంగారు నగలతో రషీద పరారైంది. దీంతో మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకొచ్చింది. రహీద సొంతూరు తమిళనాడులోని నీలగిరి జిల్లా గూడలూర్‌. సోషల్‌ మీడియాల్లో నకిలీ అకౌంట్లు తెరచి డబ్బున్న యువకులతో పరిచయం పెంచుకుని వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత అదును చూసి వారి ఇళ్లలోని నగదు, నగలతో పారిపోతుందని పోలీసులు గుర్తించారు. ఇలా ఇప్పటివరకు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మొత్తం ఎనిమిది మందిని వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.