Tomatoes as Birthday Gift: పుట్టిన రోజుకు బహుమతిగా టమాటాలు..! ఊహించని గిఫ్ట్‌కు ఉబ్బితబ్బిబ్బైన గృహిణి

దేశవ్యాప్తంగా టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో గృహిణులు ఆచితూచి టమాటాలను వినియోగిస్తున్నారు. కేవలం నెల రోజుల్లోనే కేజీ టమాట ధర రూ.20 నుంచి రూ.160కి చేరింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా రూ.200 మార్కునుకూడా..

Tomatoes as Birthday Gift: పుట్టిన రోజుకు బహుమతిగా టమాటాలు..! ఊహించని గిఫ్ట్‌కు ఉబ్బితబ్బిబ్బైన గృహిణి
Tomatoes As Birthday Gift
Follow us

|

Updated on: Jul 12, 2023 | 7:33 AM

థానే: దేశవ్యాప్తంగా టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో గృహిణులు ఆచితూచి టమాటాలను వినియోగిస్తున్నారు. కేవలం నెల రోజుల్లోనే కేజీ టమాట ధర రూ.20 నుంచి రూ.160కి చేరింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా రూ.200 మార్కునుకూడా దాటేసింది. దీంతో టమాటాలు కూడా విలువైన వస్తువుల జాబితాలో చేరిపోయాయి. ఒకప్పుడు పెళ్లిళ్లు, ఫంక్షన్లకు విలువైన వస్తువులను బహుమతులుగా ఇచ్చేవారు. ఇప్పుడు టమాటాలను బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఓ మహిళ పుట్టిన రోజు వేడుకలకు టమాటాలను గిఫ్ట్‌గా ఇవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది.

మహారాష్ట్రలోని కళ్యాణ్‌లోని కొచ్చాడి ప్రాంతానికి చెందిన సోనాల్ బోర్స్ అనే మహిళ ఆదివారం (జులై 9) నాడు తన పుట్టిన రోజు జరుపుకుంది. దీంతో ఆమె ఇంట్లో చిన్న బర్త్‌ డే పార్టీ జరిగింది. అతని సోదరుడు గౌతమ్ వాఘ్, అత్తామామలు 4 కిలోల టమాటాలను ఓ బుట్టలో తీసుకొచ్చి బహుమతిగా ఇచ్చారు. గిఫ్ట్‌గా వచ్చిన టమాటాలను చుట్టూ పెట్టుకుని సోనాల్ కేక్‌ కట్‌ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టమాటాలను బహుమతిగా అందుకోవడం  తనకు చాలా సంతోషంగా ఉందని, ఇంతకంటే మంచి బహుమతి ఇంకేం ఉంటుందని సోనాల్ ఆనందం వ్యక్తం చేసింది.

థానేలోని వాగ్లే ఎస్టేట్‌కు చెందిన కిరణ్ సింగ్ అనే గృహిణి కూడా ఆగస్టు 15 తన పుట్టిన రోజులోపు టమాటాల ధరలు తగ్గకపోతే, నేను కూడా నా భర్త, బంధువులు, స్నేహితుల నుంచి టమోటాలే బహుమతిగా రావాలని ఆశిస్తున్నాని చెప్పుకొచ్చింది. ఏదిఏమైనా టమాటా ధరలు కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఎంత పని చేశార్రా... బామ్మర్దుల పరాచకం ప్రాణాల మీదకు తెచ్చింది
ఎంత పని చేశార్రా... బామ్మర్దుల పరాచకం ప్రాణాల మీదకు తెచ్చింది
పాఠశాలల్లో సీబీఎస్‌ఈ, టోఫెల్‌ అమలుపై మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన
పాఠశాలల్లో సీబీఎస్‌ఈ, టోఫెల్‌ అమలుపై మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన
ఇది చెక్క బెరడు కాదు.. క్యాన్సర్‌ను సైతం తరిమికొట్టే సంజీవని
ఇది చెక్క బెరడు కాదు.. క్యాన్సర్‌ను సైతం తరిమికొట్టే సంజీవని
చెత్త కుప్పలో డైమండ్ నెక్లెస్.. అసలు ఏం జరిగిందంటే..
చెత్త కుప్పలో డైమండ్ నెక్లెస్.. అసలు ఏం జరిగిందంటే..
ఒకేరోజు ఇద్దరు బాధితులు.. కట్ చేస్తే రూ. 2 కోట్లు హాంఫట్..
ఒకేరోజు ఇద్దరు బాధితులు.. కట్ చేస్తే రూ. 2 కోట్లు హాంఫట్..
తమన్నా స్టెప్పులు చూస్తే.. కుర్రాళ్ళ హార్ట్ ట్రిప్ అవ్వాల్సిందే.
తమన్నా స్టెప్పులు చూస్తే.. కుర్రాళ్ళ హార్ట్ ట్రిప్ అవ్వాల్సిందే.
యుఎస్ నకిలీమందులు విక్రయిస్తూ పట్టుబడిన బీహార్‌కు చెందిన వ్యక్తి
యుఎస్ నకిలీమందులు విక్రయిస్తూ పట్టుబడిన బీహార్‌కు చెందిన వ్యక్తి
ఉత్తరాఖండ్‌లో వరద బీభీత్సం.. కొట్టుకుపోయిన వంతెన.. 50 మంది
ఉత్తరాఖండ్‌లో వరద బీభీత్సం.. కొట్టుకుపోయిన వంతెన.. 50 మంది
టిక్కెట్ లేకపోతే తిక్క తీరుతుందంతే..జరిమానాతో పాటు జైలు శిక్ష
టిక్కెట్ లేకపోతే తిక్క తీరుతుందంతే..జరిమానాతో పాటు జైలు శిక్ష
అలర్ట్‌.. ఆగస్టు 1 నుంచి మారనున్న నిబంధనలు.. అవేంటో తెలుసా?
అలర్ట్‌.. ఆగస్టు 1 నుంచి మారనున్న నిబంధనలు.. అవేంటో తెలుసా?