తమిళనాడులో మరో కొత్త పార్టీ రాబోతుందా..? పళనీ-పన్నీర్ ఫ్లాన్ ఏంటీ..?
తమిళనాడులో మరో కొత్త పార్టీ రాబోతుందా? పళనీకి చెక్ పెట్టేలా ఏఐడీఎంకే బహిష్కృత నేత అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో ఏఐడీఎంకే పొత్తు ఖరారైంది. తమిళనాట ఈక్వెషన్స్ ఏంటి? పళనీ-పన్నీర్ ఏం చేయబోతున్నారు..? ఇదే ఇప్పుడు తమిళనాట జోరుగా సాగుతున్న చర్చ.

తమిళనాడులో మరో కొత్త పార్టీ రాబోతుందా? పళనీకి చెక్ పెట్టేలా ఏఐడీఎంకే బహిష్కృత నేత అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో ఏఐడీఎంకే పొత్తు ఖరారైంది. తమిళనాట ఈక్వెషన్స్ ఏంటి? పళనీ-పన్నీర్ ఏం చేయబోతున్నారు..?
అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పన్నీర్ సెల్వం రెండు సార్లు తమిళనాడు సీఎంగా పనిచేశారు. 2001లో అక్రమాస్తుల కేసులో జయలలిత అరెస్టయిన సందర్భంగా అనూహ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2016లో జయలలిత ఆస్పత్రిలో ఉండగా మరోసారి సీఎంగా పనిచేశారు ఓపిఎస్.
అయితే జయలలిత మరణం తర్వాత అనూహ్యంగా సీఎం పదవిని దక్కించుకున్నారు పళనీస్వామి. అప్పటి నుంచి అన్నాడీఎంకేలో.. ఓపిఎస్ వర్సెస్ ఈపిఎస్‌గా నడిచింది. పార్టీనీ దక్కించుకునేందుకు పన్నీర్ సెల్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జయలలిత మరణం తర్వాత డీఎంకే విజయంతో.. అన్నాడీఎంకే కాస్త ఆదరణ తగ్గింది. ఇదే సమయంలో పార్టీపై పట్టుసాధించి AIDMK చీఫ్‌గా కొనసాగుతున్నారు పళనీస్వామి. ఇద్దరి మధ్య గొడవల కారణంగా.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పన్నీర్ సెల్వంను బహిష్కరించారు పళనీ. దాంతో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు.
తమిళనాడులో రెండు బలమైన సామాజిక వర్గాలున్నాయి. దేవర్, గౌండర్ సామాజిక వర్గాలే ఏఐడీఎంకే ఓటు బ్యాంక్‌గా ఉన్నా్యి. దేవర్ సామాజిక వర్గానికి చెందిన నేత పన్నీర్ సెల్వం. దీంతో.. ఆయనకు ఏఐడీఎంకేలో అత్యధిక ప్రాధాన్యత ఏర్పడింది. గౌండర్ సామాజిక వర్గానికి చెందిన నేత పళనీస్వామి. ఓపీఎస్ బహిష్కరణతో.. దేవర్ సామాజిక వర్గం ఏఐడీఎంకేకు దూరమైందనే వాదన ఉంది. బహిష్కరణ తర్వాత.. తిరిగి అన్నాడీఎంకేలోకి రావాలని ప్రయత్నించారు పన్నీర్ సెల్వం. కానీ.. పళనీ, ఓపీఎస్ ప్రయత్నాలను తిప్పికొట్టారు. ఇటీవల అన్నాడీఎంకే నుంచి బీజేపీలో చేరిన దేవర్ సామాజికవర్గానికి చెందిన నైనార్ నాగేంద్రన్.. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తమిళనాడులో బీజేపీ-ఏఐడీఎంకే కలిసి పోటీ చేయాలని నిర్ణయించడం, పళనీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం వేగంగా జరిగిపోయాయి.
భారతీయ జనత పార్టీతో పొత్తు కారణంగా.. దేవర్ వర్గాన్ని అన్నాడీఎంకేకు దగ్గర చేసుకునేందుకు నైనార్ నాగేంద్రన్ రూపంలో మంచి అవకాశం లభించింది. ఓపిఎస్ రీ ఎంట్రీ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈపిఎస్.. లెక్క సరిపోతుందని చెప్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో పన్నీర్ సెల్వంకు అపాయింట్మెంట్ దక్కింది. పళనీ ఒత్తిడితో చివరి నిమిషంలో మోదీ అపాయిట్మెంట్ రద్దయింది.
దీంతో ఓపిఎస్ ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి బీజేపీలో చేరడం, రెండు సొంతంగా పార్టీ ఏర్పాటు చేయడం. బీజేపీతో ఏఐడీఎంకే పొత్తుతో.. కాషాయ పార్టీలో పన్నీర్ చేరేందుకు పళనీ అడ్డుగా ఉన్నారు. ప్రధాని అపాయింట్‌మెంట్‌నే రద్దు చేయించిన పళనీ.. పన్నీర్‌ను బీజేపీలో చేర్చుకుంటే.. పొత్తు నుంచి బయటకు వస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ కూడా ఓపీఎస్‌ను లైట్ తీసుకుంటోంది.
ఇక చివరి ఆప్షన్‌గా సొంత పార్టీ ఏర్పాటు చేయాలని పన్నీర్ సెల్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో పార్టీ రిజిస్ట్రేషన్ పనుల్లో ఓపిఎస్ తరపు నాయకులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే విజయ్ పార్టీతో ఈసారి ఎలక్షన్స్‌లో తమిళనాట ట్రై యాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఓపీఎస్ కూడా పార్టీ పెడితే.. ఓట్లు భారీగా చీలే అవకాశం ఉంది. పన్నీర్ వర్సెస్ పళనీగా తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..