తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి మాతృమూర్తి కన్నుమూత
తమిళనాడు ముఖ్యమంత్రి ఇ పళనిస్వామి మాతృమూర్తి పరమపదించారు. పళనిస్వామి తల్లి దావుసాయమ్మల్ వయస్సు 93 సంవత్సరాలు. మంగళవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సేలంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దావుసాయమ్మల్ సేలం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తల్లి మరణవార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి పళనిస్వామి తన సొంత పట్టణానికి చేరుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.