Suvendu Adhikari: ముకుల్‌రాయ్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయండి: ప్రతిపక్ష నేత సువేందు డిమాండ్
Suvendu Adhikari on Mukul Roy: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటినుంచి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ముందు టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన వారు.. మళ్లీ
Suvendu Adhikari on Mukul Roy: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటినుంచి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ముందు టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన వారు.. మళ్లీ మమతా పార్టీలోకి చేరుతున్నారు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ టికెట్‌పై గెలిచి.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముకుల్ రాయ్‌ను శాసనసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి కోరారు. ఈ విషయమై ఆయన శుక్రవారం స్పీకర్ బిమాన్ బెనర్జీకి లేఖ పంపించారు. క్రిష్ణానగర్ ఉత్తర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై ముకుల్ రాయ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆయన మళ్లీ టీఎంసీలో చేరడంపై సువేందు అధికారి లేఖ రాశారు.
క్రిష్ణానగర్ ఉత్తర్ అసెంబ్లీ నియోజకవర్గం (83) నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ముకుల్ రాయ్‌ని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్‌ను స్పీకర్‌కు పంపించానన్నారు. దీనిపై వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని లేఖలో సువేందు ప్రస్తావించారు. ఇదిలాఉంటే.. ఫిరాయింపు చట్టం నిబంధనలను అదిగమించి పార్టీ మారినందుకు గాను ముకుల్ రాయ్ రాజీనామా చేయాలని సువేందు అధికారి అంతకుమందు డిమాండ్ చేశారు. బీజేపీ టికెట్‌పై గెలిచి టీఎంసీలోకి వెళ్లారని, అలా కాకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లాలని సువేందు సూచించారు.
Also Read: