Andhra Pradesh: ‘నా మెదడును మెషీన్‌తో కంట్రోల్‌ చేస్తున్నారు.. డీయాక్టివేట్‌ చేయండి మహ ప్రభో!’ సుప్రీంకోర్టులో వింత పిటిషన్‌

తన మెదడును ఎవరో మెషన్ తో కంట్రోల్ చేస్తున్నారని, దానిని వెంటనే డీ యాక్టివేట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంటూ ఆంధ్రప్రేదశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు ఏకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఇచ్చిన ట్విస్టుకి అతగాడి దిమ్మ తిరిగిపోయింది..

Andhra Pradesh: 'నా మెదడును మెషీన్‌తో కంట్రోల్‌ చేస్తున్నారు.. డీయాక్టివేట్‌ చేయండి మహ ప్రభో!' సుప్రీంకోర్టులో వింత పిటిషన్‌
Supreme Court
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 13, 2024 | 7:42 PM

న్యూఢిల్లీ, నవంబర్‌ 12: గుర్తు తెలియని వ్యక్తులు తన మెదడును మెషీన్‌ ద్వారా నియంత్రిస్తున్నారని ఓ స్కూల్‌ ఉపాధ్యాయుడు సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశాడు. పైగా తన మెదడులోని మెషిన్‌ అది పనిచేయకుండా దానిని డీయాక్టివేట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సదరు పెద్దమనిషి తన పిటిషన్‌లో కోరాడు. తాజాగా ఈ పిటీషన్‌ను తాజాగా విచారించిన సుప్రీం కోర్టు.. దానిని కొట్టివేసింది. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచిత్రమైనదిగా అభివర్ణించారు. దానిని విచారించేందుకు నిరాకరిస్తూ అభ్యర్ధనను తిరస్కరించింది. అసలేం జరిగిందంటే..

కొందరు వ్యక్తులు హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైంటిఫిక్‌ ల్యాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్‌) నుంచి మనిషి మెదడును చదివే ‘హ్యూమన్ బ్రెయిన్ రీడింగ్ మెషినరీ’ని కొంత మంది వ్యక్తులు కొనుగోలు చేశారని, దాని ద్వారా తన మెదడును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందని ఓ ఉపాధ్యాయుడు ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. తొలుత ఏపీ హైకోర్టులో ఈ పిటీషన్‌ వేయగా అప్పీలుదారుని ఆరోపణలు నిరాధారమని కోర్టు సెప్టెంబర్ 27న కొట్టివేసింది. దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

ను కొనుగోలు చేసి దాని ద్వారా తన మెదడును నియంత్రిస్తున్నారని ఏపీకి చెందిన ఉపాధ్యాయుడొకరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇతగాడి పిటిషన్‌ను సుప్రీం కోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ (ఎస్‌సీఎల్‌ఎస్‌సీ)కి దానిని పంపారు. అప్పీలుదారుని సమస్య పూర్తిగా అర్ధం చేసుకోవడానికి అక్కడి అధికారులు అతనితో తెలుగులో మాట్లాడారు. అతడి మాటలను బట్టి తన మెదడుపై ప్రభావం చూపుతున్నట్లు ఆరోపించిన యంత్రాన్ని నిష్క్రియం చేయడానికి విశాఖపట్నంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కార్యాలయాన్ని ఆదేశించాలని కోరాడు. అయితే పిటిషన్‌దారుడి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న కమిటీ అతడి మెదడును ఎవరూ యంత్రపరికరం ద్వారా నియంత్రణ చేయడం లేదని, అతని ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని నివేదిక ఇవ్వడంతో సుప్రీం కోర్టు అతడి పిటిషన్‌ను కొట్టివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!