AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: పుష్కర సంతలో ప్రత్యేక ఆకర్షణ ఈ గేదె.. 23కోట్లు ఇస్తామన్నా అమ్మను అంటున్న యజమాని

రాజస్థాన్ అజ్మీర్ లో జరిగే పుష్కర్ అంతర్జాతీయ పశువుల సంతలో దేశ విదేశాలకు చెందిన పశువులు సంతకు తరలివస్తున్నాయి. ఈ పశువుల సంతలో ప్రదర్శించిన ఒక గేదె అందరి దృష్టిని ఆకర్షించింది. రూ.23 కోట్ల విలువైన భారతదేశపు అత్యంత ఖరీదైన గేదె ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది.

Viral News: పుష్కర సంతలో ప్రత్యేక ఆకర్షణ ఈ గేదె.. 23కోట్లు ఇస్తామన్నా అమ్మను అంటున్న యజమాని
Costliest Buffalo Animal
Surya Kala
|

Updated on: Nov 13, 2024 | 7:54 PM

Share

రెండు రోల్స్ రాయిస్ కార్లు లేదా పది మెర్సిడెస్ బెంజ్ వాహనాల కంటే ఎక్కువ విలువైన గేదె గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు రాజస్తాన్ లోని పుష్కర్ జరుగుతున్న అంతర్జాతీయ పశువుల సంతలో ప్రదర్శనలో ఉంచిన ఓ గేదె అందరి దృష్టిని ఆకర్షించింది. హర్యానాకు చెందిన ‘అన్మోల్’ అనే గేదె దేశం దృష్టిని ఆకర్షించింది. వ్యవసాయ రంగంలో విలాసవంతమైన, ప్రతిష్టకు ప్రత్యేకమైన చిహ్నంగా అన్మోల్ ఖ్యాతిగాంచింది. ఇది భారతదేశపు అత్యంత ఖరీదైన గేదెగా పేరు సంపాదించుకుంది. అవును..ఈ ఎనిమిదేళ్ల వయసు ఉన్న గేదె ధర 23 కోట్ల రూపాయలు. దీంతో భారతదేశంలోనే అత్యంత ఖరీదైన గేదెగా ఖ్యాతి గడించింది. పుష్కర మేళాలో ప్రదర్శించే ఈ గేదెను కొనుగోలు చేసేందుకు చాలా మంది ముందుకు వచ్చినా దాని యజమాని పల్మింద్ర గిల్ మాత్రం తాను అమ్మబోనని చెబుతున్నాడు.

కేవలం ఎనిమిదేళ్ల వయసున్న హర్యానాలోని సిర్సాకు చెందిన అన్మోల్ గేదె రోజువారీ ఆహారం తినే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు దీని యజమాని. అన్మోల్ రోజువారీ ఆహారం, దాదాపు రూ. 1,500 ఖరీదు చేస్తుంది. దీని ఆరోగ్యాన్ని కాపాడేందుకు డ్రై ఫ్రూట్స్, అధిక కేలరీల ఆహారాల మిశ్రమం. దీని రోజువారీ ఆహారంలో 4 కిలోల తాజా దానిమ్మ, 30 అరటిపండ్లు, 20 ప్రొటీన్లు అధికంగా ఉండే గుడ్లు, పావు కిలోల బాదంపప్పులు ఉంటాయి. అదనంగా దీని ఆహారంలో ఆయిల్ కేక్, పచ్చగడ్డి, దేశీ నెయ్యి, సోయాబీన్స్, మొక్కజొన్నతో సమృద్ధిగా ఉంటుంది. ఈ డైట్‌తో పాటు, ఆవాలు, బాదం నూనెను ఉపయోగించి అన్మోల్‌కు రోజుకు రెండుసార్లు మసాజ్ చేస్తారు. బాత్ ఇస్తున్నారని యజమాని పల్మింద్ర గిల్ చెప్పారు.

అన్మోల్ ప్రత్యేకమైన ఆహారం, వస్త్రధారణతో సహా నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ గేదె యజమాని గిల్ దానిని అమ్మనని చెబుతున్నాడు. అయితే అధిక ఖర్చులను భరించ లేక ఇప్పటికే అన్మోల్ తల్లిని, సోదరిని అమ్మాల్సి వచ్చిందని చెప్పాడు. ముఖ్యంగా అన్మోల్ తల్లి ఒక అసాధారణమైన గేదె.. రోజుకు 25 లీటర్ల పాల ఉత్పత్తితో రికార్డు సృష్టించిందని వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి

అన్మోల్ వీర్యానికి అధిక డిమాండ్:

అన్మోల్ వీర్యం సంతానోత్పత్తి కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు. దీని వీర్యం ఆదాయ మార్గం. ఒక్కో నమూనా ధర రూ. 250 నుంచి 300 ఉంటుంది. దీని వీర్యంతో 900 పశువుల ఉత్పత్తికి ఉపయోగించవచ్చు. దీని వీర్యం అమ్మి నెలకు రూ. 4 నుంచి 5 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ఈ డబ్బులు అన్మోల్ పెంపకానికి గిల్ కు సహాయం చేస్తుంది. ఈ గేదెను అమ్మమని 23 కోట్ల వరకు ఆఫర్‌ వచ్చినప్పటికీ అన్మోల్‌ గేదె కాదని తన సోదరుడు కనుక తాను గేదెను అమ్మను అని స్పష్టంగా చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..